షాకింగ్: విజయ్ దేవరకొండ పాలిట విలన్ అవుతున్న కార్తికేయ.. మరీ ఇంత దారుణంగానా.!
'పెళ్లి చూపులు' సినిమాతో డిసెంట్ హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. కానీ, తర్వాతి చిత్రం 'అర్జున్ రెడ్డి'తో తనలోని బోల్డ్ యాక్టింగ్‌ను బయట పెట్టాడు. దీంతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అచ్చం ఇదే రీతిలో మరో హీరో కార్తికేయ కూడా పాపులర్ అయ్యాడు. అతడి మొదటి సినిమా 'ప్రేమతో మీ కార్తిక్' ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ, తన తర్వాతి చిత్రం 'RX100'తో అందరికీ పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ పాలిట కార్తికేయ విలన్‌గా మారుతున్నాడట. వీళ్లిద్దరి మధ్య అసలేం జరిగింది.?

విజయ్ దేవరకొండ ఆయనతో మొదటిసారి
కొద్ది రోజుల క్రితం ‘డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీని తర్వాత అతడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ‘ఫైటర్' అనే ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.

ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు
క్రేజీ హీరో కావడంతో విజయ్‌తో చేసే సినిమా కోసం పూరీ జగన్నాథ్ ఎన్నో కసరత్తులు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయనపైనా అంచనాలు పెరిగిపోయాడు. దీంతో ‘ఫైటర్' స్క్రిప్ట్ విషయంలో అన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో విజయ్ బాడీ లాంగ్వేజ్ కూడా స్పెషల్‌గా ఉంటుందని టాక్.

ఆయన ఫిదా అయ్యాడు.. వీళ్లతో కలిశాడు
కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ ముంబైలో చక్కర్లు కొట్టాడు. అక్కడ బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి పార్టీలూ గట్రా చేసుకున్నాడు. అదే సమయంలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను కలిసి ‘ఫైటర్' స్క్రిప్ట్ వినిపించాడని ప్రచారం జరిగింది. ఈ స్క్రిప్టు ఆయనకు నచ్చడంతో వెంటనే ఈ సినిమాను సమర్పించేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి.

మాములు సినిమా.. పాన్ ఇండియన్ ఫిల్మ్ అయింది
వాస్తవానికి ఈ మూవీని తెలుగులోనే తెరకెక్కించాలని మొదట అనుకున్నారు. విజయ్.. పూరీ పేరున్న వాళ్లు కావడంతో ఎంతో రిచ్‌గా తీయాలని అనుకున్నారు. అయితే, కరణ్ జోహార్ చేతిలోకి ఈ మూవీ వెళ్లిన తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకే దీన్ని తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో తీస్తారని ప్రచారం జరుగుతోంది.

కరణ్ ఒప్పించాడు.. భారీ ఖర్చు చేస్తున్నారు
ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఐదు భాషల్లో వచ్చే సినిమా కావడంతో పేరున్న కథానాయికనే ఎంచుకోవాలని చిత్ర యూనిట్ భావించినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల ఈ మూవీ కోసం కరణ్ జోహార్ సహకారంతో జాన్వీ కపూర్‌ను తీసుకున్నారని, అది కూడా రూ. 3.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

విజయ్‌కు విలన్‌గా తెలుగు హీరో
బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా బాక్సింగ్ చేసే వ్యక్తే ఉంటాడట. దీనికి తెలుగు యంగ్ హీరో కార్తికేయను తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. అతడు ఈ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్' సినిమాలోనూ విలన్‌గా చేశాడు.


Click it and Unblock the Notifications











