ఢిల్లీ పిల్లపై సుకుమార్ ఇంట్రెస్ట్.. ఆమెనే ఖాయం చేశారట!
ఈ రోజుల్లో హీరోయిన్స్ అన్నాక అభినయం ఒక్కటే ఉంటే సరిపోదు అందుకు తగిన అందం, ఆ అందాన్ని కెమెరా ముందు పరిచేయగల ధైర్యం ఉండాలి. అప్పుడే హీరోయిన్స్ సూపర్ డూపర్ అవకాశాలు చేజిక్కుకోవడం జరుగుతుంది. లేదంటే ఆశించిన మేర అవకాశాలు కష్టమే అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే నయా కొందరు హీరోయిన్స్ మాత్రం మొదటి సినిమా విడుదల కాకుండానే.. ప్రమోషన్స్ ద్వారానే అట్రాక్ట్ చేస్తూ మరీ స్పీడుగా ఉన్నారు. తాజా సమాచారం మేరకు అందులో ఒకరే హీరోయిన్ కేతిక శర్మ అని తెలుస్తోంది. ఓ వైపు తన 'రొమాంటిక్' సినిమా సెట్స్‌పై ఉండగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో రూపొందనున్న కొత్త సినిమాలో ఛాన్స్ పెట్టేసిందట ఈ ఢిల్లీ బ్యూటీ.

సుకుమార్ రైటింగ్స్, శరత్ మరార్ కలిసి ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగశౌర్య హీరోగా కాశీ విశాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కేతికా శర్మనుఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం రానుందని అంటున్నాయి సినీ వర్గాలు.
ఇక కేతిక శర్మ 'రొమాంటిక్' మూవీ విషయానికొస్తే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆయన కొడుకు ఆకాష్ పూరి హీరోగా ఈ మూవీ రూపొందుతోంది. రొమాంటిక్ డోస్ మరింత పెంచేసి ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఎండాకాలంలో సెగలు పుట్టించేలా మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











