Balayya Mokshagna: మోక్షజ్ఞ కోసం కొట్టుకుంటున్న కుర్ర డైరెక్టర్స్... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం.. అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మోక్షుని స్క్రీన్ మీద చూడాలని అభిమానులు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా అనుకుంటున్నారు. కానీ ఇదిగో ఎంట్రీ.. అదిగో ఎంట్రీ అంటున్నారే తప్ప క్లారిటీగా చెప్పడం లేదు. ఇక ఏపీ ఎన్నికల అనంతరమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య బాలయ్య చెప్పారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం కుర్ర డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంట్రీపై ఏదో ఒక కథనాలు అయితే బయటకు వస్తునే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే బాలయ్య ఆ మధ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల అనంతరమే మోక్షజ్ఞ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక వచ్చే ఏడాది మోక్షజ్ఞ స్క్రీన్ మీద చూసుకోవచ్చన్నమాట.

List of Directors Who are in the Queue For Nandamuri Balakrishna Son Mokshagna Teja Debut Movie

అయితే మోక్షజ్ఞ కోసం కుర్ర డైరెక్టర్లు అంతా లైన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కోసం చాలా మంది దర్శకులు కొత్త కొత్త కథలను తీసుకువస్తున్నారట. తొలి సినిమా అన్నప్పుడు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలి అనేది బాలయ్య ఆలోచన. మోక్షజ్ఞ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతే కాదు.. ఎవరి బ్యానర్ లో చేయాలి.. దర్శకుడు ఎవరు.. అనే విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి బ్యానర్ లో మోక్షజ్ఞ సినిమా చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే కాదు.. మోక్షజ్ఞకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే అది తొలి సినిమా కోసమా.. లేదా తర్వాతి సినిమాల కోసమా అనేది తెలియదు. అయితే మోక్షజ్ఞను హీరోగా లాంఛ్ చేసేందుకు మాత్రం కుర్ర డైరెక్టర్లు లైన్లో ఉన్నారట. ఆయన ఓకే చెప్తే.. మంచి కథలతో ముందుకు వచ్చేందుకు రెడీ ఉన్నారట.

List of Directors Who are in the Queue For Nandamuri Balakrishna Son Mokshagna Teja Debut Movie

అయితే అందులో సీనియర్ దర్శకుడు సింగితం శ్రీనివాసరావు పేరు కూడా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఆ సినిమాకు సీక్వెల్ ఆదిత్య 999 మోక్షుతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే బాలయ్య కూడా ఈ సినిమా సీక్వెల్ తీస్తానని అప్పట్లో చెప్పారు. మరో వైపు పూరీ జగన్నాథ్ కూడా మోక్షును లాంఛ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

పూరీ ఇప్పటికే ఎందో మంది కుర్ర హీరోలకు డెబ్యూ మూవీలను అందించాడు. ఇప్పుడు మోక్షను కూడా లాంఛ్ చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం మంచి కథను రాశారట. భగవంత్ కేసరి సినిమా సెట్ లో మోక్షజ్ఞ ఉన్న ఫోటోస్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. భగవంత్ కేస‌రి సినిమా షూటింగ్ టైంలో అనిల్ వర్క్ నచ్చిన బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రి బాధ్యతలను అనిల్‌ రావిపూడికి అప్పగించాల‌ని చూస్తున్నారంటూ ప్రచారం అయితే జరుగుతోంది.

List of Directors Who are in the Queue For Nandamuri Balakrishna Son Mokshagna Teja Debut Movie

ఇక వీళ్లే కాకుండా... బోయపాటి శ్రీను, గోపిచంద్ మలినేని కూడా మోక్షజ్ఞ కోసం కథలు రాస్తున్నారని తెలుస్తోంది. మరి వీరిలో బాలయ్య ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.. ఏ డైరెక్టర్ తో సినిమా తీయిస్తాడు అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే మోక్షు కోసం ఇంతమంది లైన్లో ఉండటం విశేషమే అని చెప్పాలి. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X