మహేష్ బాబుతో మరో స్టార్ డైరెక్టర్.. ఆ గొడవను మర్చిపోయి మళ్ళీ కొత్తగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు మెల్లమెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు. టాలెంట్ ఉంటే ఎలాంటి దర్శకులతో వర్క్ చేయడానికైనా సరే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముందు కథ నచ్చితే చాలు.. ప్రొడ్యూసర్ ను వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు. ఇక గతంలో మహేష్ బాబుకు అలాగే కొంతమంది దర్శకులకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ గొడవలు మర్చిపోయి మహేష్ మళ్ళీ కొత్తగా ఒక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.

అందులో నిజం లేదు.
సినిమా వరల్డ్ లో క్లాషెస్ అనేవి చాలా కామన్. అయితే కాలం వాటిని మర్చిపోయేలా చేస్తుందని చెప్పవచ్చు. దానికి తోడు సక్సెస్ ఉంటే అపర్దాలు ఈజీగా తొలగిపోతాయి. ఇక మహేష్ సాధారణంగా ఎలాంటి కాంట్రవర్సీ జోలికి కూడా వెళ్ళడు. కానీ ఆయనతో కొంతమంది దర్శకులకు విబేధాలు తలెత్తాయని రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ అందులో నిజం లేదు.

అందుకే రిస్క్ చేయడానికి ఇష్టపడరు.
మహేష్ కు ఫైనల్ గా కథ నచ్చాలి. ఎలాంటి అగ్ర దర్శకుడైన సరే స్క్రిప్ట్ బాగా రాస్తేనే వర్క్ చేయాలని డిసైడ్ అవుతారు. ఒక సినిమా ప్లాప్ అయితే ఎంతో మంది నష్టపోతారు అనే కోణంలోనే మహేష్ ఎక్కువగా ఆలోచిస్తాడు. అందుకే రిస్క్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఆ విధంగా ఆలోచించే కొంతమంది అగ్ర దర్శకులకు నో చెప్పేశారు.

మహేష్ ఇంప్రెస్ కాకపోతే..
ఇక అందులో సుకుమార్, పూరి జగన్నాధ్ వంటి దర్శకులు కూడా ఉన్నారు. మహేష్ కు మొదట ఒక లైన్ వినిపించిన ఆ దర్శకులు అనంతరం ఆయన ఒప్పుకుంటేనే ఫుల్ స్క్రిప్ట్ చేసుకొని వచ్చేవారు. నెలల పాటు ఓపికతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా కూడా మహేష్ ఇంప్రెస్ కాకపోతే డైరెక్ట్ గానే చెప్పేవాడు. సుక్కు, పూరి విషయంలో అదే జరిగింది.

పూరి అప్సెట్ అయినట్లు
ఇక ఆ ఇద్దరు దర్శకులు అప్సెట్ అయినట్లు అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. పూరి అయితే ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా మహేష్ తో మరో సినిమా చేయడానికి నాకు క్యారెక్టర్ ఉండాలిగా అంటూ వివరణ ఇవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది. రెండు హిట్స్ ఇచ్చినా కూడా మహేష్ సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదని పూరి అప్సెట్ అయినట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది.
Recommended Video

పాత స్క్రిప్ట్ లో మార్పులు చేసి..
ఇక ఫైనల్ గా పూరి, మహేష్ పాత గోడవను మర్చిపోయి మళ్ళీ మరో సినిమాను చేయడానికి రెడీగా ఉన్నట్లు టాక్ వస్తోంది. పాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్టును ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని తప్పకుండా మహేష్ , పూరి కాంబో ఉంటుందని టాక్. ఒకవేళ సెట్టయితే మాత్రం రాజమౌళి ప్రాజెక్ట్ తరువాతే ఉండవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











