twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దర్శకులు మళ్ళీ మహేశ్‌తో సినిమా చేసే ఛాన్స్ లేదా.. ఇంకా కోపం తగ్గినట్లు లేదు?

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు అని నేటితరం దర్శకులు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. మహేష్ బాబుతో సినిమా చేయాలంటే ఆయనను సంప్రదించాల్సిన అవసరం లేదు. హిట్టు పడితే ఆయనే పిలిచి మరి అవకాశం ఇస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అయితే ఇద్దరు స్టార్ దర్శకులు మాత్రం మళ్ళీ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ లేదనే టాక్ వస్తోంది. ఇకపోతే బుజ్జగించేందుకు మహేష్ వారిని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    హిట్టు పడితే..

    హిట్టు పడితే..

    సాధారణంగా ఎలాంటి హీరో అయినా కూడా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటారు. ఒకప్పుడు హిట్టిచ్చినా కూడా ప్రస్తుతం ఫామ్ లో లేకపోతే అలాంటి దర్శకులకు చాలా వరకు దూరంగానే ఉంటారు. ఇక మహేష్ బాబు కూడా సక్సెస్ లో ఉన్న దర్శకుల వైపు ఎక్కువగా ఇంట్రెస్ చూపిస్తారు అనేది ఇండస్ట్రీలో మరొక టాక్ వైరల్ అవుతోంది.

    సుకుమార్, పూరీలతో..

    సుకుమార్, పూరీలతో..

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్, సుకుమార్ ఇదివరకే మహేష్ బాబుతో వర్క్ చేశారు. పూరి జగన్నాథ్ అయితే మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మెన్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చాడు. ఇక సుకుమార్ వన్ నేనొక్కడినే హిట్టు కాకపోయినప్పటికి మహేష్ కెరీర్ లో ఆ సినిమా ఒక కల్ట్ ఫిల్మ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

    మహేష్ తీరు నచ్చక..

    మహేష్ తీరు నచ్చక..

    అయితే ఈ ఇద్దరు దర్శకులతో మహేష్ బాబుకి విబేధాలు తలెత్తినట్లు గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. నిజానికి సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయాల్సింది. కానీ కథలో మార్పులు చేయాలని చెప్పి ఒకటికి పదిసార్లు ఆయనను తిప్పించుకోవడంతో వెంటనే అతను బన్నీతో సినిమా స్టార్ట్ చేశాడు. ఆ తరువాత మహర్షి ఈవెంట్ లో నా కోసం చాలా రోజులుగా ఎదురుచూసిన దర్శకుల్లో వంశీ ఒకరని ఆ చిత్ర దర్శకుడిని పొగడడంతో ఆ మాటలు సుకుమార్ మరోలా తీసుకున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

    Recommended Video

    Brothers Day : Naga Babu Emotional Post On Pawan Kalyan And Chiranjeevi
    మళ్ళీ వర్క్ చేయాలని?

    మళ్ళీ వర్క్ చేయాలని?

    పూరి కూడా జనగనమణ స్క్రిప్ట్ విషయంలో చాలాసార్లు మహేష్ ని కలిశాడు. కానీ ఫామ్ లో లేని దర్శకుడు అని తనను పట్టించుకోలేదని పూరి ఎవరు ఊహించని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోసారి మహేష్ బాబుతో వర్క్ చేయాలని అనుకోవడం లేదని, తనకు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పకనే చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ ఈ ఇద్దరి దర్శకులను కలిసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల తరువాత తప్పకుండా ఒక సినిమా చేద్దామని ఇద్దరి దర్శకులకు ఇప్పటికే ఒక మాట చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Today's directors are trying their best to make a movie with Tollywood superstar Mahesh Babu. To make a film with Mahesh Babu you do not need to consult him. There is a talk in the industry that if hit, he will call and give him a chance. However, the two star directors are again talking about Mahesh Babu's movie Chance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X