హాట్ టాపిక్.. అల్లు శిరీష్ రిజెక్ట్ చేస్తే మహేష్ ఓకే చెప్పాడా!
హెడ్డింగ్ చూస్తే ఒక్కసారిగా ఎవ్వరికైనా షాక్ కొట్టినట్టు అవుతుంది. అల్లు శిరీష్ రిజెక్ట్ చేసిన కథను మహేష్ బాబు అంగీకరించాడంటే అందరికీ ఓ భయం పట్టుకుని ఉండొచ్చు. అయితే ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉండొచ్చు. ఎవరి నిర్ణయం ఎప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పలేం. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబు చేయబోతోన్న సర్కారు వారి పాట కాన్సెప్ట్‌ను గతంలోనే అల్లు శిరీష్‌కు వినిపిస్తే రిజెక్ట్ చేశాడట. అయితే ఆ కథలోని మార్పులు చేర్పులు చేసి మహేష్ బాబు ఓకే చెయించుకున్నాడని తెలుస్తోంది. అసలు ఆ సంగతి ఏంటో ఓ సారి చూద్దాం.
మహేష్ టాటూ వెనుక అసలు రహస్యం.. సర్కారు వారి పాటలో అదే హైలెట్!

అల్లు శిరీష్ దురదృష్టం..
శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి ముందు పరుశురామ్ అల్లు శిరీష్‌కు రెండు కథలు వినిపించాడట. అయితే ఆ రెంటిని కూడా అల్లు శిరీష్ ఓకే చేయలేదట నచ్చలేదని పక్కన పెట్టేశాడట. అయితే అందులోంచి బయటకు వచ్చిన ఓ కథే గీత గోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ రెండో కథ...
అల్లు శిరీష్ వద్దని చెప్పిన ఆ రెండో కథ ఇప్పుడు మహేష్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇప్పటికే సర్కారు వారి పాట కథ అది, ఇది అని ఎన్నో రకాలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక దోపిడిలకు పాల్పడే వారిపై ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడనేది లైన్ అని తెలుస్తోంది.

మహేష్ కోసం మార్పులు..
అయితే మహేష్ బాబును మొదటగా పరుశురామ్ కలసి ఈ కథ చెప్పినప్పుడు సున్నితంగా తిరస్కరించి తరువాత చూద్దామని అన్నట్టు వినికిడి. అయితే వంశీ పైడిపల్లి వ్యవహారం బెడిసి కొట్టేసరికి మళ్లీ పరుశురామ్ లైన్‌లోకి వచ్చాడు. మహేష్ స్థాయికి తగ్గట్టు మరిన్ని మార్పులు చేసి సూపర్ స్టార్ చేత ముద్ర వేయించుకున్నాడు.
Recommended Video

టైటిల్‌తోనే ట్రెండ్..
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన సర్కారు వారి పాట టైటిల్ పోస్టర్, టైటిల్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ సమయంలో మిలియన్ ట్వీట్లను సొంతం చేసుకున్న సినిమా టైటిల్‌గా రికార్డులను క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











