పాన్ ఇండియా ఎఫెక్ట్.. విజయ్ దేవరకొండ సినిమా నుంచి మణిశర్మ ఔట్?
మెలోడీ బ్రహ్మ మణిశర్మ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే మెగాస్టార్ ఆచార్య సినిమాకు కూడా మ్యూజిక్ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా కారణంగా ఆయన ఒక సినిమా నుంచి తప్పుకోవాల్సి వస్తోందట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మణిశర్మ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో డిజైన్ చేస్తున్నారు. కారోన్ జోహార్ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే మ్యూజిక్ విషయంలో కూడా కరణ్ జోహార్ అభ్యంతరం చెప్పడంతో మణిశర్మ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును బాలీవుడ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నాడు.

పూరి జగన్నాథ్ కరణ్ జోహార్ తో చేతులు కలపడానికి కారణం కూడా అదే. కానీ బాలీవుడ్ లో మణిశర్మతో రిస్క్ చేయలేనని బాలీవుడ్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని సెట్ చేసుకుందామని కరణ్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు పూరి జగన్నాథ్ కూడా ఒప్పుకోలేక తప్పలేదట. ఇక మణిశర్మ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకుండా ప్రాజెక్టు నుంచి తప్పకున్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











