Varun Tej Lavanya: వరుణ్ తేజ్, లావణ్యల హానీమూన్ స్పాట్ ఫిక్స్... అక్కడే ఎందుకో తెలుసా?
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య ఇటీవల నవంబర్ 1న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. వీరి పెళ్లి మెగా ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీ హాజరై దగ్గరుండి జరిపించారు. ఇక ఇండియాకు తిరిగివచ్చిన ఈ జంట.. ఇప్పుడు మరోసారి హానీమూన్ కోసం.. వేరే దేశానికి వెళ్లనున్నారట. వీరి హానీమూన్ స్పాట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐదు నుంచి ఆరు ఏళ్లుగా ప్రేమను దాచి పెట్టి... ఎవరికీ డౌట్ రాకుండా మెయిన్ టెయిన్ చేసింది వరుణ్ తేజ్ లావణ్య. ఈ లవ్ బర్డ్స్ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా... ఎవరు స్పందించలేదు. సడెన్ గా ఇంట్లో చెప్పి.. నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఇక ఇటీవల నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీ.. వీరితో పాటు.. ఇండస్ట్రీలోని సన్నీహితుల మధ్య అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఇక నవంబర్ 5న హైదరాబాద్ లో సినీ ప్రముఖులకు కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులు షూటింగ్ బిజీలో పడిపోయిన వరుణ్ తేజ్.. ఇటీవల అత్తారింటి వాళ్ల కోసం.. రిసెప్షన్ కూడా ఇచ్చారు. లావణ్య తరుపు బంధువుల కోసం రిసెప్షన్ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక దీపావళిని ఇటీవల ఈ జంట ఘనంగా జరుపుకుంది. దీపావళి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. హానీ మూన్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ హనీమూన్ కోసం ఓ స్పెషల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారట. అదేక్కడో కాదు.. ఇండోనేషియాలోని బాలి నగరం. త్వరలోనే వీరు బాలీకి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అక్కడే వీరు తమ హానీమూన్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది.
Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌ను బలి చేసిన బిగ్ బాస్... ఆ కంటెస్టెంట్‌ను గెలిపించేందుకే అలా!
ఇటీవల జంటలు... మాల్దీవ్స్ కు హానీమూన్ కి వెళ్తుంటే.. వీరు మాత్రం డిఫరెంటుగా ఆలోచించారని నెటిజన్స్ అంటున్నారు. బాలీ ప్లేస్ అందమైన ప్రదేశం. ఈ వాతావరణం కు బాలి అయితే పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ అని అందుకే.. వరుణ్ లావణ్య అక్కడే హానీమూన్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అలా వీరు బాలీ దేశానికి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు అక్కడే ఉండి.. ఎంజాయ్ చేసి వస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్.. మట్కా, ఆపరేషన్ వాలైంటైన్ చిత్రాలు చేస్తున్నాడు. ఇవి త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇక లావణ్య త్రిపాఠి సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు నేరవేర్చనుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











