Hi Nanna: హాయ్ నాన్న మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ మంచి కథతో హృదయాలను బరువెక్కెలా చేసేశాడు. అయితే ఈ సినిమాకు మొదట హీరోగా నానిని అనుకోలేదట. ఆ హీరో ఎవరు.. ఎందుకు మిస్ చేసుకున్నాడు.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఖుషికి సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. విడుదల అయిన మొదటి రోజు నుంచే మంచి టాక్ వస్తుంది.
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హాయ్ నాన్న రూపుదిద్దుకుంది. హాయ్ నాన్న ఒక ఎమోషనల్ రైడ్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కథలోని భావోద్వేగాలు, నాని, మృణాల్, బేబి కియారా నటన, మలుపులు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. నానికి ఈ సినిమాతో మరో హిట్ పడినట్లు అని అర్థం అవుతుంది. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

హాయ్ నాన్న మూవీకి ఫస్ట్ ఛాయిస్ నాని కాదని తెలుస్తోంది. నిజానికి ఓ మెగా హీరో ఈ సినిమా చేయాల్సిందని నెట్టింట వైరల్ గా మారింది. కానీ సదరు హీరో కథ వినకుండానే రిజెక్ట్ చేశారని సమాచారం. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంట. డైరెక్టర్ శౌర్యువ్ మొట్టమొదట వరుణ్ తేజ్ తో హాయ్ నాన్న చేయాలని భావించాడని టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే స్టోరీని నేరేట్ చేయడానికి కూడా ప్రయత్నించాడట శౌర్యువ్.
వరుణ్ తేజ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం.. పైగా లావణ్యతో పెళ్లి డిస్కషన్స్ లో ఉండటం కారణంగా వరుణ్ తేజ్ కథ వినడానికి కూడా మొగ్గు చూపలేదని అంటున్నారు. దాంతో మరో ఆప్షన్ లేకుండా శౌర్యువ్ నాని వద్దకు వెళ్లారని... ఆయనకు స్టోరీ నచ్చడంలో వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హాయ్ నాన్న వంటి మంచి మూవీని చేతులారా మిస్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











