రహస్యంగా 25 మంది హీరోలని ఏకం చేసిన చిరంజీవి.. ఆ ఛానల్స్‌కి దిమ్మ తిరిగేలా, పవన్ అన్నట్లుగానే!

Recommended Video

Tollywood Top Heros Attend To Chiranjeevi sudden Meet

శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వ్యవహారం, కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు టాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా కొన్ని మీడియా సంస్థలు అనవసరమైన విషయాలని ప్రజల మీదికి ఎలా రుద్దుతున్నాయో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని అతిదారుణంగా దూషిచడం, ఆ క్లిప్పింగులని కొన్ని మీడియా ఛానల్స్ పదే పదే ప్రసారం చేయడం, డిబేట్లు పెట్టి లబ్ది పొందాలని చూశాయి. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఎనిమిది నెలలుగా తనపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న మీడియా ఛానల్స్ పై పవన్ ఎలాంటి మాట మాట్లాడలేదు. తన తల్లిని కూడా దూషించే నీచమైన ప్రక్రియకు ఒడికట్టడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఆయా మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించారు. పవన్ చేస్తున్న యుద్ధంలో టాలీవుడ్ కూడా చేరనుందనే వార్తలు వస్తున్నాయి.

రంగంలోకి దిగిన మెగాస్టార్

రంగంలోకి దిగిన మెగాస్టార్

ఇండస్ట్రీలో జరుగుతున్నా పరిణామాలను గమనించిన మెగాస్టార్ చిరంజీవి మంగళవారం రంగంలోకి దిగారు. అత్యవసరంగా, రహస్యంగా 25 టాలీవుడ్ హీరోలు, ఇండస్ట్రీ పెద్దలతో మంగళవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో సమావేశం నిర్వహించారు.

హాజరైంది వీరే

హాజరైంది వీరే

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సూపర్ స్టార్ మహెష్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి ప్రముఖ హీరోలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్

ఇటీవల పవన్ కళ్యాణ్ మా అసోషషన్ కు వెళ్లి ఇండస్ట్రీ పెద్దలతో, మా సభ్యులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ గురించి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో అంతర్మధనం మొదలైంది.

పవన్ ఇచ్చిన పిలుపు

పవన్ ఇచ్చిన పిలుపు

పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం టీవీ9, ఏబీఎన్, టివి5 ఛానల్స్ ని బాయ్ కాట్ చేయాలని అభిమానులకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సదరు ఛానల్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

సంచలన ప్రతిపాదన

సంచలన ప్రతిపాదన

చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన హీరోల సమావేశంలో కూడా సంచలన ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సదరు టివి ఛానల్స్ కు చిత్ర పరిశ్రమకు చెందిన ఆడియో వేడుకలు, యాడ్స్ ఇవ్వకూడదని ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మరో మరు సమావేశం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ముందే ఆపని చేసి ఉంటే

ముందే ఆపని చేసి ఉంటే

శ్రీరెడ్డి వ్యవహారం మొదలైనప్పుడే పిలిచి మాట్లాడి ఉంటె పరిస్థితి ఇక్కడకి వరకు వచ్చేది కాదని కొందరు ఈ సమావేశంలో అభిప్రాయ పడ్డారు.

తిరుగులేని దెబ్బ

తిరుగులేని దెబ్బ

ఒక వేళ సదరు న్యూస్ ఛానల్స్ ని బహిష్కరించాలని సినీ పెద్దలు నిర్ణయిస్తే అది ఆయా సంస్థలకు భారీ షాక్ అని చెప్పొచ్చు. చిత్ర పరిశ్రమని ఉపయోగించుకునే ఆయన సంస్థల ఎక్కువగా టిఆర్పి రేటింగులు సాధిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X