Mega 157: మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్.. ఈసారి ఎవరితోనే తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే చాలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా తెగ ఎగ్జైట్ అవుతుంటారు. ముఖ్యంగా ఆయన సినిమా సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

విరామం లేకుండా తెగ కష్ట పడిపోయేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు చిరంజీవి. అయితే ఇప్పటికే విశ్వంభర సినిమా షఊటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్.. ఇప్పడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు నచ్చిన ఓ కథకు డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా దొరకడంతో.. విశ్వంభర కాగానే ఆ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. తాజాగా ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి చిరంజీవి నెక్స్ట్ సినిమా Mega 157 ఎవరితో చేయబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Megastar Chiranjeevi green Signal to Mega 157 movie Check Details

బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి.. తన 157వ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ మాత్రం ఈ డైరెక్టర్ ది కాదు. రచయితగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న బీవీఎస్ రవి ఓ కథను చిరంజీవికి వినిపించారట. చాలా కాలం క్రితమే ఈ స్టోరీ విన్న చిరంజీవి.. ఎలాగైనా సరే ఈ చిత్రంలో నటించాలని ఫిక్స్ అయ్యారట. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ ను మాత్రం ఫిక్స్ చేయలేరు.

గతంలో ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో తీయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఆయన బిజీగా ఉండడంతో.. ఈ ప్రాజెక్టు హరీష్ శంకర్ చేతికి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సహ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

Megastar Chiranjeevi green Signal to Mega 157 movie Check Details
Supritha Debut Movie: సురేఖ వాణి కూతురు సినిమాల్లోకి.. బిగ్‌బాస్ కంటెస్టెంటే హీరో.. ఎవరో తెలుసా?

సోషల్ మీడియా మొత్తం ఈ వార్త ఫుల్ వైరల్ అవుతోంది. అలాగే ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న Mega 157లో మరో యంగ్ పెయిర్ ఉంటుందని కూడా గతంలో టాక్ నడించింది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ విరిద్దరూ ఈ ప్రాజెక్టు కోసం ఇంకా సైన్ చేయలేదని సమాచారం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X