‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్: ప్రపంచ ఛాంపియన్‌ను దింపుతున్న పూరీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇంత కాలం టాలీవుడ్‌లో తన హవాను చూపించిన అతడు.. ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న 'లైగర్' మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అతడు బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'లైగర్' మూవీ కోసం విజయ్ దేవరకొండ ఇప్పటికే బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఇందుకోసం ప్రొఫెషనల్ బాక్సర్లతో సహాయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రపంచ మాజీ ఛాంపియన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను కూడా తీసుకు వస్తున్నాడట దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అతడి రోల్ క్లైమాక్స్ సీన్‌కు ముందు వస్తుందని అంటున్నారు. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.


Click it and Unblock the Notifications











