ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్.. ఇది సరిపోదు ఇంకా కావాలంటున్న హీరోయిన్
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కోణంలో ఆలోచిస్తున్నారు నేటితరం కుర్ర హీరోయిన్లు. సినిమా అవకాశం రావడమే గొప్ప అవకాశంగా కొందరు భావిస్తుంటే, కెరీర్ తొలి నాళ్ళలోనే పడిన హిట్స్ తో మరికొందరు డిమాండ్ పెంచేస్తున్నారు. హిట్ పడ్డప్పుడే ఫిగర్ పెంచేయాలని చుస్తునారు. తాజాగా ఇలానే ఆలోచిస్తోందట ఇస్మార్ట్ బ్యూటీ.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరే నభా నటేష్. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ఈ భామ చేసిన రొమాన్స్ క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది. తన అందాల ఆరబోతతో వెండితెరకు కొత్త అందం తీసుకొచ్చింది. గతంలో ఆమె చేసిన 'నన్ను దోచుకుందువటే' సినిమాను మించిన క్రేజ్ 'ఇస్మార్ట్ శంకర్' ద్వారా ఆమె సొంతమైంది. దీంతో వెంటనే డిమాండ్ పెంచేసిందట నభా.

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నభా నటేష్ తన రెమ్మ్యూనరేషన్‌ని 30 లక్షల నుంచి 40 లక్షలకు పెంచేసిందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఒకరిద్దరు నిర్మాతలు నభాని సంప్రదించగా.. అంతిస్తేనే ఓకే లేదంటే కుదరదని నిర్మొహమాటంగా చెప్పేసిందట నభా. ఇక ఇస్మార్ట్ సక్సెస్‌తో మంచి జోష్ లో ఉన్న నభా నటేష్ ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కూడా హిట్ అయ్యిందంటే ఇక నభా నటేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోవటం ఖాయం.


Click it and Unblock the Notifications











