వర్మతో బీర్ల పార్టీలో ఎంజాయ్ చేసిన యంగ్ హీరోయిన్.. చివరకు ఇదీ ఆమె పరిస్థితి!
ఒక్కప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పూరి జగన్నాథ్ 'టెంపర్' సినిమా తర్వాత సరైన హిట్ సాధించలేకపోయారు. దీంతో ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి పనైపోయినట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ రూపంలో భారీ హిట్ సాధించాడు. ఈ విజయం పూరి అండ్ టీంలో కొత్త జోష్ నింపింది. దీంతో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ యూనిట్ సభ్యులు.. రామ్ గోపాల్ వర్మతో బీర్లు పొంగించిన సంగతి తెలిసిందే. అయితే బీర్లతో అప్పుడు చేసిన ఆ ఎంజాయ్ నభా నటేష్‌కి లేని ఇబ్బందులు తీసుకొచ్చిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

పూరి జగన్నాథ్ ఒక్కడే కాదు వర్మ కూడా..
గతంలో పూరి జగన్నాథ్.. రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ నెలకొంది. ఆ కారణంగా ఇస్మార్ట్ విజయాన్ని పూరితో కలిసి వర్మ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ఈ మేరకు చిత్రయూనిట్ అందరితో కలిసి బీర్లు పొంగించాడు రామ్ గోపాల్ వర్మ.

బీర్లు.. హీరోయిన్లు.. రచ్చ రచ్చ
ఇస్మార్ట్ విజయంతో ఫుల్ ఖుషీ అయిన వర్మ బీరు బాటిల్‌తో రచ్చ రచ్చ చేశాడు. బీరును పొంగించి, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, హీరోయిన్స్ నిధీ అగర్వాల్, నభా నటేశ్ సహా చిత్ర యూనిట్‌పై పోశారు. అంతేకాదు, చివర్లో తాను కూడా మిగిలిన బీర్ మొత్తానికి మీద పోసుకున్నాడు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

బాగానే ఎంజాయ్ చేశారు.. కానీ చివరకు
వర్మ చేసిన బీర్ పార్టీ రచ్చతో పూరి అండ్ టీం బాగానే ఎంజాయ్ చేశారు కానీ ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్‌ని మాత్రం ఈ పార్టీ కాస్త ఇబ్బంది పెట్టేసిందట. బీర్లతో తడిసిముద్దైన నభా ఆ మరుసటి రోజునుంచి జ్వరంతో బాధపడిందట. అందుకే ఆమె విడుదల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్' ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదని వార్తలు షికారు చేస్తున్నాయి.

నభాపై వర్మ కామెంట్
ఇస్మార్ట్ టీంతో ఎంజాయ్ చేసిన వర్మ.. ఆ తర్వాత హీరోయిన్ నభా నటేష్‌తో ఫోటో దిగారు. ఆ పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఆమెను ఇలియానాతో పోల్చుతూ ఏకంగా ఇలియానా 2 .0 అనేశాడు వర్మ. ఆయన చేసిన ఈ కామెంట్ నభాకి మంచి బూస్టింగ్ అయింది.

ఇస్మార్ట్ హవా.. పెంచేసిన నభా
ఇదిలా ఉంటే.. ఇస్మార్ట్ శంకర్ అందించిన విజయంతో నభా నటేష్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినదని తెలుస్తోంది. గతంలో 30 లక్షలు రెమ్మ్యూనరేషన్ గా తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు 40 లక్షలకు మించి డిమాండ్ చేస్తోందట.


Click it and Unblock the Notifications











