పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: వర్మపై నాగ్ సీరియస్.. ఆఫీసర్ పరిస్థితి ఏంటి ?

టాలీవుడ్ లో శ్రీరెడ్డి వివాదం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పోరాటంమంటూ మొదలు పెట్టిన ఆమె ఆ తరువాత అసభ్య పదజాలం ఉపయోగించడం, అనవసరంగా పవన్ కళ్యాణ్ ని, అతని తల్లిని దూషించడంతో హాట్ టాపిక్ గా మారింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆమె పై కోపాన్ని ప్రదర్శించడంలేదు. ఎందుకంటే దీని వెనుక ఉన్న కుట్ర బలమైన ఆధారాలతో తెలిసిందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. టివి9 రవిప్రకాష్, టివి9 ఓనర్ శ్రీనిరాజు, చంద్రబాబు తనయుడు లోకేష్, అతని స్నేహితులు కలసి వివాదాస్పద దర్శకుడు వర్మతో పన్నిన పన్నాగం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ అంశం సినీరాజకీయ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిస్సిగ్గుగా వర్మ తాను చేసిన అకృత్యాని ఒప్పుకోవడం, దానిని సమర్థించుకుంటుండడంతో ప్రముఖులు వర్మ చేసిన పనిని ఛీదరించు కుంటున్నారు. ఈ ప్రభావం వర్మ, నాగ్ ఆఫీసర్ చిత్రంపై పడే అవకాశం ఉందనే కామెంట్స్ సినిపిస్తున్నాయి.

వర్మపై ఛీత్కారాలు

వర్మపై ఛీత్కారాలు

పవన్ కళ్యాణ్ తల్లిని తానే శ్రీరెడ్డి చేత తిట్టించానని వర్మ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. పైగా వర్మ తన నీచమైన చర్యని ఎప్పటిలాగే తనదైన శైలిలో సమర్ధించుకోవడం జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖులు వర్మని అసహ్యించుకుంటున్నారు. మొదట దీనిపై నిర్మాత నిర్మాత అల్లు అరవింద్ స్పందించి వర్మని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

పూరి జగన్నాథ్ కూడా

పూరి జగన్నాథ్ కూడా

వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ కూడా దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇంతలా బాధపడడం తాను ఇంతవరకు చూడలేదని పూరి అన్నారు. వర్మ చేసిన పని తనకు నచ్చలేదని పూరి స్పందించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ

పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ

రాంగోపాల్ వర్మకు రూ 5 కోట్లు ఎవరో డబ్బు ఇచ్చి ఇలాంటి నీచమైన పని చేయించారని అల్లు అరవింద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తన తల్లిని అనవసరమైన విషయంలోకి లాగడంతో రగిలిపోయిన పవన్ కళ్యాణ్ దీనివెనుక జరుగుతున్న కుట్ర ఇది అని వర్మతో సహా టివి9 రవిప్రకాష్, టీవీ9 ఓనర్ శ్రీనిరాజు, లోకేష్ పేర్లు బయటపెట్టిన సంగతి తెలిసిందే.

నాగార్జున సీరియస్

నాగార్జున సీరియస్

ప్రస్తుతం వర్మ నాగార్జునతో ఆఫీసర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడంలో పాత్ర వహించడంతో నాగార్జున అతడిపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ పనులకు నాగార్జున ఏమాత్రం సంతృప్తి కరంగా లేకపోగా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

ఆఫీసర్‌పై ఎఫెక్ట్

ఆఫీసర్‌పై ఎఫెక్ట్

చాలా లాలం తరువాత నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆఫీసర్. కానీ ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సిన ఉంది. కానీ వర్మ ఈ నీచపు పనికి పాల్పడడంతో నాగార్జున గుర్రుగా ఉన్నారట. ఆఫీసర్ చిత్రంపై దీని ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X