బాలయ్య ఫాన్స్ కు పూనకాలు వచ్చే న్యూస్.. రౌడీ స్టార్ కాంబోలో రచ్చ.. గట్టిగా ప్లాన్ చేసిన పూరీ!

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'లైగర్‌'. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

లైగర్ సినిమా మొదలు

లైగర్ సినిమా మొదలు

చివరగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ప్రేక్షకులలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. సినిమా పరంగా బాగానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా మొదలు పెట్టాడు.

అమెరికాలో

అమెరికాలో

బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాని కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ అలాగే పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ అమెరికాలో పూర్తి అయింది.

లైగర్‌ సెట్‌లో ప్రత్యక్షం

లైగర్‌ సెట్‌లో ప్రత్యక్షం

ఇక ఈ షెడ్యూల్ లో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణను కూడా భాగం చేశారనే టాక్ పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. బాలకృష్ణతో ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఒక ఐదు నిముషాల చిన్న రోల్ చేయించారని అంటున్నారు. దీనికి ఊతం ఇచ్చేలాగా గోవాలో ఈ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ లైగర్‌ సెట్‌లో ప్రత్యేక్షం అయ్యారు.

మంచి టాక్

మంచి టాక్

బాలయ్య సర్‌ప్రైజ్‌ విజిట్‌ అని అప్పట్లో ప్రకటించారు కానీ దీని వెనుక కారణం అదేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను రిలీజ్ చేయగా మంచి టాక్ తెచ్చుకుంది.

 అతిధి పాత్ర

అతిధి పాత్ర

మైక్ టైసన్‌ తో పాటు బాలకృష్ణ చేత అతిధి పాత్రను పూరి జగన్నాధ్ చేయించినట్టు చెబుతున్నారు. నిజానికి మైక్ టైసన్ కోసం బాలకృష్ణ తన వాయిస్ ఓవర్ ఇస్తాడని ఊహాగానాలు వినిపించాయి, కానీ ఇప్పుడు బాలకృష్ణ లైగర్‌లో అతిధి పాత్రను పోషిస్తున్నట్లు బలమైన బజ్ ఉంది. ఒకవేళ ఆ బజ్ నిజమైతే దేవరకొండ, బాలయ్య అభిమానులకు ఇది ఒక బంపర్ ఫీట్ అవుతుంది.

Recommended Video

Anand Devarakonda About Pushpaka Vimanam Movie Success
పైసా వసూల్‌

పైసా వసూల్‌

పూరీ బాలకృష్ణతో కలిసి పైసా వసూల్‌ సినిమా కోసం పని చేశారు. ఆయన సాన్నిహిత్యంతో ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి బాలకృష్ణ ఒప్పుకున్నారని అంటున్నారు. ఇక లైగర్ సినిమా గురించి చెప్పాలంటే ఏప్రిల్ 1, 2022న థియేట్రికల్ రిలీజ్ కోసం టీమ్ సిద్ధం అవుతోంది. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X