మరోసారి ‘పైసా వసూల్’ కాంబినేషన్.. కానీ ఒక కండీషన్ అంటున్న బాలయ్య..!

Recommended Video

Nandamuri Balakrishna Condition To Puri Jagannadh | Ismart Shankar | Ram Pothineni || Filmibeat

వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై పూరీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇది హిట్ అయితేనే తనకు భవిష్యత్ ఉంటుందని ప్రగాడంగా నమ్ముతున్నాడు.

‘పైసా వసూల్’తో నిరాశ

‘పైసా వసూల్’తో నిరాశ

గతంలో పూరి జగన్నాథ్- నందమూరి బాలకృష్ణతో ‘పైసా వసూల్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడమ విడుదలైన ఈ సినిమా.. భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ‘పైసా వసూల్'లో సరికొత్త బాలయ్యను పరిచయం చేసిన పూరీ.. కథలో మాత్రం చూపించలేకపోయాడు. దీంతో అటు పూరీ అభిమానులతో పాటు ఇటు బాలయ్య ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.

మరోసారి బాలయ్యతో..

మరోసారి బాలయ్యతో..

ఎన్టీఆర్ బయోపిక్‌ ఫలితంతో నిరాశ చెందిన నందమూరి బాలకృష్ణ భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి, కేఎస్ రవికుమార్ చిత్రాలకు సంతకాలు చేసేశారు. అయితే, ఇందులో బోయపాటి సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పూరీ.. బాలయ్యను సంప్రదించాడని తెలుస్తోంది. ఆ సమయంలో తనతో సినిమా చేయాల్సిందిగా బాలయ్యను కోరాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కండీషన్ పెట్టిన బాలయ్య

కండీషన్ పెట్టిన బాలయ్య

పూరీ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చేసిందట. దీంతో ఆయనతో సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన బాలయ్య.. ఒక కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ అయితేనే ఈ సినిమా పట్టాలెక్కుతుందనేదే ఆ కండీషన్ అని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే వీళ్లిద్దరి సినిమా ప్రారంభం కావాలంటే ‘ఇస్మార్ట్ శంకర్' ఇరగదీయాలన్న మాట.

 ‘జై సింహా’ కాంబినేషన్

‘జై సింహా’ కాంబినేషన్

‘జై సింహా'వంటి సక్సెస్ ఇచ్చిన కేఎస్ రవికుమార్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. సీ కల్యాణ్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు ‘క్రాంతి' అనే టైటిల్ పెట్టబోతునట్లు వార్తలు వస్తున్నాయి.

పూరీ మాత్రం ఇస్మార్ట్‌గా...

పూరీ మాత్రం ఇస్మార్ట్‌గా...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్' జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే విడుదలైన రామ్ లుక్, టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X