twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాష్ట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సినిమా?

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ వ్యక్తిత్వం, దుందుడుకు తనం గురించి అందరికీ తెలిసిందే. ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా ఉండే పవన్ ఆ మధ్య అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ప్రాచారం చేసి ఇతర పార్టీల నేతలను షేక్ చేశాడు. వాళ్ల పంచలు ఊడగొట్టినంత పని చేశారు. అప్పటి ప్రచారంలో అవినీతి నాయకులపై, దగాకోరు లీడర్లపై పవన్ చేసిన ప్రసంగాలు రాష్ట్ర ప్రజలను ఆకర్షించాయి. అనంతర పరిణామాల నేపథ్యంలో అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.......అన్నయ్య చేసిన పనికి చాలా బాధ పడి, రాజకీయాలకు, అన్నయ్యకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే చర్చ సాగుతోంది ఫిల్మ్ నగర్ లో. ఇటీవల పంజా ఆడియో వేడుకకు మెగా కుటుంబం దూరంగా ఉండటం, అన్నయ్య వారసత్వం అవసరం లేదని పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో....మెగా కుటుంబంలో చిచ్చురేగిందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

    ఆ విషయం పక్కన పెడితే...తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నారట. తీన్ మార్ నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది.

    పవన్ కళ్యాన్ లాంటి హీరో రాజకీయ సినిమా అనగానే....సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాలపై సెటైరిక్ గా ఆ సినిమా ఉంటుందా? రాజకీయాల్లో నవ్వుల పాలౌన అన్నయ్య చిరంజీవి క్యారెక్టర్ ను పవన్ ఇందులో ఎలా చూపించబోతున్నారు? అంటూ చర్చించుకుంటున్నారు.

    English summary
    Pawan Kalyan is planning to do a full pledged political film very soon, says the buzz. Pawan’s ideologies and his dreams to serve the needy were evident in his campaign done for Praja Rajyam. He is planning to do a powerful political film very soon as per his ideologies.Puri Jagannadh might direct this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X