»   »  తేడా వస్తే బుక్కయిపోతాం: చిరు విషయంలో పవన్ జోక్యం వద్దు!

తేడా వస్తే బుక్కయిపోతాం: చిరు విషయంలో పవన్ జోక్యం వద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికే సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా, అనుకోకుండా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం సెట్ కావడంతో సినిమాను తాత్కాలికంగా వాయిదా వేసారు. శ్రీజ వివాహం ఈ నెల 28న బెంగులూరులో జరుగనుంది. అనంతరం చిరంజీవి 150వ సినిమా మొదలు కానుంది.

చిరు కూతురు శ్రీజ పెళ్లి బెంగుళూరులో... (రేర్ ఫోటోస్)
గతంలో చిరంజీవి, పవన్ మధ్య సంబంధాలు సరిగా లేవనే ప్రచారం జరిగేది. అయితే ఇటీవల చిరంజీవి స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో కలవడం, పవన్ స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చేసి కలవడం లాంటివి జరిగాయి. ఈ కలయికలతో అన్నదమ్ముల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం తేలి పోయింది.

అయితే చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అన్నయ్య సినిమాకి సంబంధించిన విషయాలు కొన్ని స్వయంగా తానే పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని, ముఖ్యంగా పాటలు, ఫైట్స్ విషయంలో తనదైన మార్కు చూపెట్టాలని పవన్ ఆశ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.... ఈ విషయం విన్న వెంటనే మెగా ఫ్యాన్స్ , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. చిరంజీవి సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోక పోవడమే మంచిదని అంటున్నారు. అసలే చిరంజీవి సినీ జీవితంలో 150వ సినిమా మైల్ స్టోన్ మూవీ. పవన్ జోక్యం చేసుకుని, ఆ సినిమా హిట్టయితే ఫర్వాలేదు కానీ.... రేపు ఏదైనా తేడా వస్తే.... ఆ మరక జీవితాంతం పవన్ కళ్యాణ్ మీద అలానే ఉంటుంది. అనవసరంగా బుక్కయిపోతాం అని ఫ్యాన్స్ మదనపడుతున్నారు.

సర్దార్ సెట్లో...

సర్దార్ సెట్లో...


ఆ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్స్ వెళ్లి తన తమ్ముడిని కలిసారు చిరంజీవి.

రూమర్స్

రూమర్స్


అంతకు ముందు ఇద్దరి మధ్య విబేధాలు ఉండేవనే రూమర్స్ ఉండేవి. వీరి కలయికతో రూమర్స్ కు తెర పడింది.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో చిరంజీవి రాకతో యూనిట్ మొత్తం సర్ ప్రైజ్ అయ్యారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


ఓ సారి షూటింగ్ మధ్యలో సడెన్ గా వెళ్లి అన్నయ్య చిరంజీవిని కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్.

విబేధాలు లేవు

విబేధాలు లేవు


అన్నయ్య, రామ్ చరణ్ లతో కలిసి పవన్ కళ్యాణ్

English summary
Film Nagar source said that, Pawan Kalyan involvement in Chiranjeevi 150th movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu