పవన్ కళ్యాణ్‌తో పూరి జగన్నాథ్ భారీ ప్లాన్.. కన్ఫర్మ్! ఫిలింనగర్‌ సర్కిల్స్‌లో వాడివేడి చర్చ

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ తిరిగి ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఆయనతో గతంలో సినిమాలు రూపొందించి సక్సెస్ అయిన దర్శకనిర్మాతలు మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని ఆరాట పడుతున్నారు. ఈ మేరకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ భారీ ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఫిలింనగర్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

థమన్ హింట్.. పవన్ రీ ఎంట్రీ హాట్ టాపిక్

థమన్ హింట్.. పవన్ రీ ఎంట్రీ హాట్ టాపిక్

'పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే అని కన్ఫర్మ్ చేస్తూ ఇటీవలే ఓ హింట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. దీంతో పవన్ రీ ఎంట్రీ అంశం రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తోంది. ఈ డైరెక్టర్ తో సినిమా, ఆ డైరెక్టర్ తో పవన్ మూవీ కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో వార్తల ప్రవాహం కనిపిస్తోంది.

డైరెక్టర్ క్రిష్‌తో పవన్ సినిమా

డైరెక్టర్ క్రిష్‌తో పవన్ సినిమా

'పింక్' తెలుగు రీమేక్ ద్వారా ఆయన రీ ఎంట్రీ ఇవాబోతున్నారని, ఈ సినిమాకి దిల్ రాజు, బోణీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. సరిగ్గా ఈ తరుణంలో డైరెక్టర్ క్రిష్‌తో పవన్ సినిమా రాబోతుందని కూడా న్యూస్ చక్కర్లు కొట్టింది.

ఇంతలో పూరి జగన్నాథ్ టాపిక్..

ఇంతలో పూరి జగన్నాథ్ టాపిక్..

ఇదిలా ఉండగానే పూరి జగన్నాథ్ టాపిక్ తెరపైకి వచ్చింది. ఈ డాషింగ్ డైరెక్టర్ పవన్‌తో భారీ సినిమాను ప్లాన్ చేశాడని టాక్ నడుస్తోంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆయన పవన్‌కి ఓ కథ వినిపించడం, దానికి పవన్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని ఫిలింనగర్‌లో చర్చలు నడుస్తున్నాయి.

 భారీ సినిమా.. పూరి స్కెచ్

భారీ సినిమా.. పూరి స్కెచ్

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా తరువాత వెంటనే పవన్‌తో పూరి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. పవన్‌తో చేయబోయే ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించాలని పూరి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అప్పట్లో అలా.. ఇప్పుడిలా

అప్పట్లో అలా.. ఇప్పుడిలా

గతంలో పూరి జగన్నాథ్- పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తలదన్నే విధంగా ఇప్పుడు పవన్ కోసం పూరి మరో స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇది పవన్ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. చూడాలి.. ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు కనుల్లపండగే మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X