మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. అదే జరిగితే సీఎం పవన్ కళ్యాణ్! ఇక పండగే పండగ..
పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారు. అతి త్వరలో ఆయన సీఎంగా కనిపించబోతున్నారు. వినడానికే ఈ పదం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. ఇక సీఎంగా ఆయన్ను చూస్తే! ఇంకేమన్నా ఉంటుందా? మెగా అభిమానలోకానికి అవధుల్లేని ఆనందమే. అందుకే అలాంటి ప్రయత్నం చేయబోతున్నారట డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఏంటి.. అర్థం కాలేదా? అయితే ఈ వివరాలు చూడండి మీకే తెలుస్తుంది.

రీ ఎంట్రీ.. వేగంపెంచిన పవన్
'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత వెండితెరకు బై బై చెప్పేసిన పవన్.. దాదాపు రెండేళ్ల పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అధికారం చేజిక్కించుకోకపోయినా జనసేనానిగా ప్రజాభిమానం పొందారు. తిరిగి ఇప్పుడు సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన వేగం పెంచేసి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

వకీల్ సాబ్ ప్లాన్ ఇదే..
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్ ద్వారా రీ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో లాయర్ రోల్ పోషిస్తున్నారు పవన్. బోనీ కపూర్, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలనేది ప్లాన్.

తెలంగాణ రాబిన్ హుడ్ పవన్ కళ్యాణ్
దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్.. ఆ మూవీ పనుల్లో కూడా భాగమవుతున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ రాబిన్ హుడ్‌గా పవన్ నటించనున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ కేటాయించి ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం ఈ సినిమా నిర్మించనున్నారు.

పవన్ జోష్ మామూలుగా లేదుగా!
ఈ రెండూ ఇలా ఉండగానే ముచ్చటగా మూడో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. దీంతో ఈ ఏడాది పవన్ సినిమాల జోష్ మామూలుగా ఉందని తెలిసిపోయింది.

పూరి స్టోరీ లైన్.. పవన్ రెడీ
ఇదంతా ఓ ఎత్తయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నారనేది మరో ఎత్తయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి పూరి స్టోరీ లైన్ వినిపించారని, దానికి పవర్ స్టార్ సుముఖత వ్యక్తం చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది.

జనసేనానుల కోరిక.. సీఎం పవన్
అయితే ఈ సినిమాలో పవన్‌ని సీఎంగా చూపించబోతున్నారట పూరి. కథ ప్రకారంగా పవన్ సీఎం రోల్ పోషించబోతున్నారట. ఈ విషయాన్ని పవన్ చాలా పాజిటివ్‌గా తీసుకొని రెడీ అన్నారని ఇన్‌సైడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే పవన్‌ని సీఎంగా చూడాలనుకుంటున్న జనసేనానుల కోరిక ఎన్నికలకు ముందే ఈ రకంగా తీరిపోయినట్లే మరి.
Recommended Video

జనాల్లో అప్పుడే హోప్స్.. అదే జరిగితే
గతంలో పూరి జగన్నాథ్- పవన్ కాంబినేషన్‌లో ''బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు'' సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాయి కాబట్టి.. వీరి హాట్రిక్ సినిమాపై జనాల్లో అప్పుడే హోప్స్ పెరిగిపోయాయి. అఫీషియల్ ప్రకటన వస్తే గానీ దీనిపై సరైన క్లారిటీ వస్తుంది.


Click it and Unblock the Notifications











