Peddi: ‘పెద్ది' ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) కాంబోలో తెరకెక్కుతున్న భారీ మూవీ పెద్ది (Peddi).ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బిజినెస్‌లో 'పెద్ది' దూకుడు
ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. నాన్-థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా ఓటీటీ హక్కులను నెట్ ఫిక్స్ (Netflix) సుమారు రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కూడా రూ.70 కోట్ల వరకు వెళ్లే అవకాశముంది. ఇక ఆడియో హక్కులు ఇప్పటికే T-Series ద్వారా రూ.35 కోట్లకు అమ్ముడయ్యాయి. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమా మొత్తం రూ.300 కోట్లకు పైగా మార్క్‌ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైజాం, సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక, ఓవర్సీస్-అన్ని ఏరియాల్లో భారీ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి.

Peddi Item Song Buzz Mrunal Thakur to Dance with Ram Charan Massive Hype Around Special Track

పాన్ ఇండియా మూవీ పెద్ది పై ఇప్పటికే అంచనాలను ఆకాశాన్నంటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా కొన్ని వారాలు ఉండగానే ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. 'చికిరీ చికిరీ', 'రై రై రారా' వంటి పాటలు మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో దుమ్మురేపుతూ మిలియన్ల వ్యూస్ దాటాయి. ముఖ్యంగా ఏ.ఆర్.రెహమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్‌పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సాంగ్స్‌తోనే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాయి. పాటలు, గ్లింప్స్‌తో క్రేజ్ పెంచుకున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ టాపిక్ వైరల్ అవుతోంది.

అదే స్పెషల్ ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ఎంట్రీ. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న పేరు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఆమె స్టెప్పులు వేయనుండగా, జాన్వీ కపూర్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ ఎలా డిజైన్ చేస్తారు? కొరియోగ్రఫీ ఎలా ఉంటుంది? అనే విషయాలు ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పాట సరిగ్గా కుదిరితే సినిమా హైలైట్‌గా నిలిచే అవకాశముంది.

ఇదిలా ఉంటే.. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చి బాబు సనా టీజర్ లేదా ట్రైలర్ రూపంలో ఏదో ప్రత్యేక సర్ప్రైజ్ ఇవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Rishabh Shetty: రిషబ్ శెట్టికి కోట్ల ఆఫర్.. జై హనుమాన్ పారితోషికం డీల్‌లో ట్విస్ట్!ఇదిలా ఉండగా, ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు చిత్రబృందం ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టింది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతుండగా, బిజినెస్ డీల్స్ కూడా దాదాపు పూర్తి దశలో ఉన్నాయి. విడుదల తేదీని ఏ మాత్రం మార్చకుండా థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో యూనిట్ నిరంతరం కష్టపడుతోంది.

More from Filmibeat

Read more about: mrunal thakur peddi ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X