Peddi: మిస్‌ ఇండియాతో రామ్ చరణ్.. ఏం ప్లాన్ చేశావయ్యా బుచ్చిబాబు!

టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది' (Peddi) మరోసారి వార్తల్లో నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు, ఈ సినిమాను వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారట. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో తాజాగా స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ రామ్ చరణ్ తో మాస్ స్టెప్పులేసే హీరోయిన్ ఎవరంటే?

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏ.ఆర్.రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'చికిరీ చికిరీ', 'రై రై రారా' వంటి పాటలు మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మంచి రెస్పాన్స్ సాధించడంతో, మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. సోషల్ మీడియా నయా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు రాబోయే స్పెషల్ సాంగ్‌పై అందరి దృష్టి పడింది.

Peddi Ram Charan to Dance with Miss India Manasa Varanasi in Special Song

మొదట ఈ స్పెషల్ సాంగ్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపించింది. ఒకే ఫ్రేమ్‌లో అంతమంది స్టార్ హీరోయిన్లు, రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేస్తే థియేటర్లలో ఫ్యాన్స్‌కు అది పండుగే అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. యూనిట్ ఈ పాటను భారీగా ప్లాన్ చేస్తున్నప్పటికీ, అంతమంది హీరోయిన్లను తీసుకోవాలన్న ఆలోచన ప్రస్తుతం లేదని టాక్.

ఇదిలా ఉండగా, ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. అయితే చివరి నిమిషంలో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో మిస్ ఇండియా మానస వారణాసి (Manasa Varanasi) పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.2020లో 'మిస్‌ ఇండియా' కిరీటం నెగ్గిన ఈ భామ.. ఈ గెలుపుతో సినిమాల వైపు మొగ్గుచూపింది. అలా 2024లో 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలో తొలి అవకాశం వచ్చింది.

హైపర్ ఆది వల్లే జబర్దస్త్‌కు గుడ్ బై ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్‌ బ్యూటీఇటీవల 'కపుల్‌ ఫ్రెండ్లీ'తో మంచి పేరొచ్చింది. ఈ అమ్మడు తన నటనతోనే కాదు.. డాన్స్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రూమర్‌కు మరింత బలం చేకూరేలా కొందరూ రామ్ చరణ్ - మానస వారణాసి ఫోటోలతో పోస్ట్‌లు షేర్ చేయడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. మానస వారణాసి ఎంట్రీ నిజమైతే, ఇది ఆమెకు టాలీవుడ్‌లో ఒక మంచి బ్రేక్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందంతో పాటు క్లాస్ లుక్ కలిగిన ఆమె, ఈ మాస్ సాంగ్‌లో ఎలా కనిపిస్తున్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక సినిమా విషయానికి వస్తే, రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో, క్రికెట్ చరణ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, రామ్ కెరీర్‌లో మరో మాస్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్, అతని ట్రాన్స్‌ఫర్మేషన్, గుబురు గడ్డం, మాస్ బాడీ అన్నీ కలిసి సినిమా మీద అంచనాలను పెంచేశాయి.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా, ఏప్రిల్ 30న పూర్తి చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. స్పెషల్ సాంగ్ షూట్ కూడా త్వరలో ప్రారంభం. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన సమాచారం. మొత్తంగా 'పెద్ది' సినిమా ప్రతి చిన్న అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్ సొంతం చేసుకుంటోంది. ఇక స్పెషల్ సాంగ్‌లో కనిపించబోయే హీరోయిన్ ఎవరన్నది అధికారికంగా తెలిసే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X