రెండో ఆవిడ విషయం: పవన్ -త్రివిక్రమ్.... ఆమెను బుక్ చేస్తారా?

ప‌వ‌న్‌ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ కాంబినేషన్లో ఇటీవల ప్రారంభమైన న్యూ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా పూజా హెడ్గేను ఎంపిక చేసారు.

By Bojja Kumar

హైదరాబాద్: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఓ హీరోయిన్ గా ఇప్పటికే కీర్తి సురేష్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే విషయంలో అభిమానుల్లో కొంతకాలంగా చర్చసాగుతోంది.

 ఈమెను తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు

ఈమెను తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు

పవన్ సరసన రెండో హీరోయిన్‌గా పూజా హెగ్డే చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయమై అపీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. తెలుగులో ఒక లైలాకోసం, ముకుంద‌, చిత్రాల‌తో పాటు బాలీవుడ్ మూవీ మొహంజ‌దారో చిత్రాల్లో న‌టించిన పూజా హెగ్డే ఇప్పుడు అల్లుఅర్జున్ డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథమ్ చిత్రంలో న‌టిస్తుంది.

 కీర్తి సురేష్ ఆనందం..

కీర్తి సురేష్ ఆనందం..

నా నెక్ట్స్ తెలుగు మూవీ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు అంటూ.... చేతులెత్తి నమస్కరిస్తున్న సింబల్ తో ట్వీట్ చేసింది.

 పూజా హెడ్గే బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా....

పూజా హెడ్గే బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా....

పూజా హెడ్గే బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

 ‘అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత

‘అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత

‘అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కొంత కాలంగా ఈ సినిమా విషయం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ ప్రారంభం అయింది.

 రామానాయుడు స్టూడియో

రామానాయుడు స్టూడియో

రామానాయుడు స్టూడియోలో శనివారం(నవంబర్ 5) ఉదయం 10.49 గంటలకు ఫిక్స్ చేసిన ముహూర్తానికి పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిక క్రియేషన్స్ బేనర్లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ నెం 4గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 ల్యాండ్ మార్క్ మూవీ

ల్యాండ్ మార్క్ మూవీ

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని ఎస్ రాధాకృష్ణ తెలిపారు. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

 ఇద్దరు హీరోయిన్లు

ఇద్దరు హీరోయిన్లు

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫైనల్ అయింది. మరో హీరోయిన్ ఎవరనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. బహుషా సమంతను తీసుకునే అవకాశం ఉందని టాక్.

 టాప్ టెక్నీషియన్స్

టాప్ టెక్నీషియన్స్

ఈ సినిమా టాప్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారు. సౌత్ లో ఈ మధ్య మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇండియాస్ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్.... రావన్, అపరిచితుడు, యే జవాని మై దివాని, మై హూ నా లాంటి చిత్రాలకు పని చేసిన వి మణికందన్ పని చేస్తున్నారు.

 ఇతర టీం

ఇతర టీం

ఈ చిత్రానికి ఆర్ట్: ఎఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిడివి ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు), కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

 ఫస్ట్ టైం

ఫస్ట్ టైం

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేయడమే అరుదు. అయితే ఈ సారి మూడు సినిమాలకు కమిట్ కావడం విశేషం. పవన్ కల్యాణ్ కెరీర్లోనే ఇలా ఒకేసారి మూడు సినిమాలు చేయడం ఇదే తొలిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X