Prabhas రూ.500 కోట్ల బాలీవుడ్ రామాయణంలో ప్రభాస్.. ఈ సారి ఏ పాత్రలో అంటే?
బాలీవుడ్లోప్రతిష్టాత్మకంగా రూ.5000కోట్లతో మరో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో వార్త కూడా బయటికి వస్తూ మూవీపై ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. అయితే తాజాగా మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ మధ్య ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ ఇప్పుడీ కొత్త రామాయణంలో మరో పాత్ర చేయబోతున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆయన ఏ పాత్ర చేయనున్నారో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలితో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత తన భారీ లైనప్‌లతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా ఆదిపురుష్‌తో అందరినీ షాక్ అండ్ సర్ప్రైజ్కు గురి చేశారు. కానీ ఈ చిత్రం ఎంతలా బోల్తా కొట్టిందంటే ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఏ సినిమాకు రానీ రేంజ్లో భారీ విమర్శలు వచ్చాయి. రాముడిగా ప్రభాస్ సెట్ అవ్వలేదని అంతా అన్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా సినిమాపై దాదాపు నెల రోజుల పాటు ఆగకుండా విమర్శిస్తూనే వచ్చారు.

అయితే ఇంత జరిగాక కూడా ప్రభాస్ మరో రామాయాణంలోకి నటించడానికి రెడీ అవుతున్నారని బయట కథనాలు వస్తున్నాయి. అదే బాలీవుడ్లో నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మరో రామాయణం. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి చాలా ఏళ్లే అయినా ఇంత వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. నటీనటుల విషయంలో ఇంక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భారీ త్రయం కోసం మూవీటీమ్ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ స్టార్స్‌ను అందరినీ తీసుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది.
Brahmamudi March 2nd రాజ్‌కు అత్తింట్లో అడుగడుగునా అవమానం... కావ్యపై డౌట్ వచ్చేలా చేసిన శ్వేత!
ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నట్లు ఇప్పటికే ఇది ఫిక్స్ కూడా అయిపోయినట్లు ఫిల్మ్ నగర్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, రావణుడి చెల్లి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక బాబీ దేఓల్ను కుంభకర్ణగా, అని అంటున్నారు.

అయితే ఇప్పుడూ పరశురాముడి పాత్ర పేరు తెరపైకి వచ్చింది. స్పెషల్ అప్పీరెన్స్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ కాస్టింగ్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. కానీ ఈ వార్త విని కొంతమంది ఫ్యాన్స్ సంతోషపడుతుంటే మరి కొంతమంది మిక్స్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌కు మరో రామాయణం అవసరమా అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఇకపోతే రామాయణ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగాన్ని 2025 దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ 17న రాబోతోంది. ఇక రెండో భాగం పూర్తయ్యాకే రెండో భాగం గురించి ప్రస్తావన వచ్చే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











