ప్రభాస్ 'స్పిరిట్'లో మలయాళ మెగాస్టార్.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్ ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ సినిమా 'స్పిరిట్'. ఈమూవీ తాజాగా అధికారికంగా సెట్స్ మీదకు వెళ్లింది. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సినిమాలతో క్రేజ్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముహూర్తం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరలవుతుంది. ఇంతకీ ఏంటీ?
'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ ను హైలెట్ చేసే కథను సందీప్ వంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'స్పిరిట్' మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ప్రేక్షకులకూ కట్టిపడేసే అలాంటి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోందట. ఈ మూవీలో హీరోయిన్‌గా 'యానిమల్'తో సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ఇక కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్‌లు నటించబోతున్నట్టు సమాచారం.

మలయాళ మెగాస్టార్ ఎంట్రీ?
ఈ ప్రాజెక్ట్‌లో ఓ మలయాళ సూపర్‌స్టార్ కీలక పాత్రలో కనిపించనున్నాడన్న మాటలు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ పేరు మరెవరిదీ కాదు.. మోహన్‌లాల్ (Mohanlal). వంగా ఇప్పటికే ఈ పాత్రకు ప్రత్యేక షేడ్ డిజైన్ చేశారట. మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, మోహన్‌లాల్ ఎంట్రీ నిజమైతే 'స్పిరిట్'హైప్స్ మరింత పెరగడం ఖాయం అని ట్రేడ్ అంచనా.
కొరియన్ యాక్షన్ ఐకాన్ తో బిగ్ ట్విస్ట్?
నిజానికి ఇంటర్నేషనల్ యాక్టర్ల ఎంపికలో 'స్పిరిట్' టీమ్ ఇప్పటికే అడుగులు వేసిందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా 'ట్రైన్ టు బుసాన్' ఫేమ్ డాన్ లీ (Ma Dong Seok) విలన్ పాత్రలో నటిస్తున్నాడా? అనే ప్రశ్నకు సందీప్ వంగా నేరుగా సమాధానం ఇవ్వకుండా "అప్‌డేట్ త్వరలోనే వస్తుంది" అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. డాన్ లీ ఎంట్రీ నిజమైతే, ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని స్థాయి గ్లోబల్ ఫైట్ కోర్ యూనివర్స్ చూపించనున్నదని అభిమానులు భావిస్తున్నారు.
Bigg Boss 9 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్.. ఇమ్మాన్యుయేల్ నిర్ణయంతో గేమ్ టర్న్..
తాజా సమాచారం ప్రకారం మూవీ మేకర్స్ ఓ భారీ యాక్షన్ సెట్ ను నిర్మిస్తోంది. ఈ సెట్లో రెండు వారాల పాటు నిరంతర యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సినిమాలోనే టర్నింగ్ పాయింట్‌గా మారి, 'స్పిరిట్' హైలైట్‌గా నిలిచే సీన్ ఇదేనని ఇండస్ట్రీ టాక్.ఇక సంగీతం విషయానికి వస్తే.. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలకు స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే వంగాతో మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో యాక్షన్ సీన్లకు మరింత పవర్ పుల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
'స్పిరిట్' ను టి-సిరీస్ (భూషణ్ కుమార్), భద్రకాళి పిక్చర్స్ (సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీ నుంచి విడుదలైన ప్రభాస్ లుక్ ఇప్పటికే అంచనాలు మరింత పెరిగిపోయాయి. టాలీవుడ్‌లో స్టార్డమ్, బాలీవుడ్‌లో బజ్, గ్లోబల్ యాక్షన్ ఎస్టేటిక్స్ అని కలిసి మూవీ యాక్షన్ మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











