పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ మూవీ అప్‌డేట్.. క్రేజీ హీరోయిన్ ఫిక్స్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో జోష్‌లో ఉన్న పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయమై ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

పూర్తి స్థాయి మాస్ మూవీ.. అంతకుమించి

పూర్తి స్థాయి మాస్ మూవీ.. అంతకుమించి

'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ప్రకటించిన పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నారట పూరి జగన్నాథ్. ఇందుకోసం గోవా వెళ్లేందుకు ఆయన సిద్దమయ్యారట.

సినిమా నేపథ్యం.. టైటిల్ ఇదే

సినిమా నేపథ్యం.. టైటిల్ ఇదే

ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందని, ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కథకు తగ్గట్టు గానే ఈ క్రేజీ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ టైటిల్ కన్ఫర్మ్ అయినట్లే అనే టాక్ వినిపిస్తోంది. ఛార్మి ఇదే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించిందని టాక్.

 హీరోయిన్ ఎవరంటే..

హీరోయిన్ ఎవరంటే..

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై బయటకొచ్చిన వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కన్నుగీటి కుర్రకారు మతిపోగోట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారని టాక్ నడుస్తోంది. మరోవైపు నితిన్, చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్ రూపొందనున్న కొత్త సినిమాలో కూడా ప్రియా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు

షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు

తాజా సమాచారం ప్రకారం పూరి- విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ నవంబర్ నెలలో మొదలు పెట్టనున్నారని సమాచారం. త్వరత్వరగా షూట్ ఫినిష్ చేసి 2020 సమ్మర్ లేదా అంతకంటే ముందే రిలీజ్ అయ్యలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూరి షూటింగ్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కసారి మొదలు పెడితే అంతా పర్ఫెక్టుగా పూర్తవుతుంది. పైగా విజయ్ దేవరకొండతో షూటింగ్ అంటే ఇక ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 అతి త్వరలో అఫీషియల్ స్టేట్‌మెంట్

అతి త్వరలో అఫీషియల్ స్టేట్‌మెంట్

ఇక ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్, చార్మి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X