twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి జగన్నాథ్, ఛార్మి భారీ స్కెచ్.. ఈ సారి కాస్త వెరైటీగా.. రూటు మార్చి!

    |

    సినిమాల్లో నటించడం మానేసిన ఛార్మి.. బిజినెస్ పరంగా సరికొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. వెండితెరపై కనిపించనని ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన ఈ బ్యూటీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మించే పనిలో పడింది. పూరి కనెక్ట్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించించిన పూరి జగన్నాథ్, ఛార్మీలు ఈ బ్యానర్‌పై పలు సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్‌కి అన్నీ తానై బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న ఛార్మి.. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌కి సంబందించిన వ్యవహారాలు కూడా హాండిల్ చేస్తోంది.

    ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్.. కాస్త కొత్తగా ఆలోచించి

    ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్.. కాస్త కొత్తగా ఆలోచించి

    ఈ రెండు బ్యానర్స్ లు సంయుక్తంగా తెరకెక్కించిన సినిమానే 'ఇస్మార్ట్ శంకర్'. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ మేరకు కాస్త కొత్తగా ఆలోచించి ఓ వెబ్ సైట్ ప్రారంభించారు పూరి, ఛార్మి. మాస్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఆ కోణంలోనే మెన్స్ క్లోత్స్ సేల్ చేసేందుకు గాను beismart.in అనే పేరుతో వెబ్ సైట్ ప్రారంభించారు.

    డిస్కౌంట్ కూడా ఇస్తామంటూ

    డిస్కౌంట్ కూడా ఇస్తామంటూ

    తమ beismart.in వెబ్ సైట్ ద్వారా ముందుగా బట్టలు బుక్ చేసుకున్న వారికి 30 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తామని ప్రకటించారు పూరి, ఛార్మి. దీంతో జనం ఎగబడి మరీ ఈ వెబ్‌సైట్ విసిట్ చేసి బట్టలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రకంగా జనాల్లో ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిపోతోంది.

    పూరి జగన్నాథ్, ఛార్మి వేసిన స్కెచ్ ఇది

    పూరి జగన్నాథ్, ఛార్మి వేసిన స్కెచ్ ఇది

    అయితే ఈ విషయం తెలుసుకొని.. ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్‌లో భాగంగా పూరి జగన్నాథ్, ఛార్మి నేతృత్వంలో వేయబడిన పర్ఫెక్ట్ స్కెచ్ ఇది అని అంటున్నారు కొందరు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌కి ప్రమోషన్, బిజినెస్‌కి బిజినెస్ రెండూ వర్కవుట్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఓ రకంగా చూస్తే ప్రమోషన్, బిజినెస్ రెండూ ఏకకాలంలో ఊపందుకునేలా ఛార్మి, పూరి వేసిన భారీ స్కెచ్ ఇది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఇద్దరి మోడ్రెన్ ఆలోచనలను భేష్ అని అనొచ్చు.

    ఇస్మార్ట్ శంకర్ మూవీ

    ఇస్మార్ట్ శంకర్ మూవీ

    రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఇస్మార్ట్ శంకర్' మూవీ. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఛార్మి, పూరిజగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జులై 18 వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens will seen in this movie. Behalf of this movie pranotions beismart.in website started by Charmy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X