బాలయ్య కోసం ఆ ఇద్దరూ వైటింగ్.. మరి ఆ సినిమా!
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ కు మెహబూబా రూపంలో మరో పరాజయం ఎదురైంది. తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి చేసిన చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఎమోషనల్ ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. పూరి ప్రస్తుతం తదుపరి చిత్రపు దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Recommended Video

ఇటీవల ఈ దర్శకుడు బాలయ్యని కలసి కథ వినిపించాడని సమాచారం. బాలయ్య అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాడట. బాలకృష్ణ ఒకే చేస్తే ఈ చిత్రం ప్రారంభం కానుంది. మరో వైపు మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.

అదే సమయంలో తనకు బాగా కలసి వచ్చిన బోయపాటితో మరో సినిమా చేయబోతున్నాడు వీటన్నింటిలో ఏ చిత్రం ముందుగా పార్రంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మరో వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. దర్శకుడు తేజ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అయోమయం నెలకొని ఉంది. అన్ని విషయాలలో బాలయ్య క్లారిటీ ఇవ్వవలసి ఉంది.


Click it and Unblock the Notifications











