Ismart Shankar సీక్వెల్ కోసం పూరి బిగ్ ప్లాన్.. ఇక వేట మొదలయ్యేది అప్పుడే!
లైగర్ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ పోతినేనితో మూవీ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. చార్మీ ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతోంది. ఏకంగా ఈ సినిమా కోసం 50 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారంట.
రామ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో స్కంద మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే దీనిని తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, టైటిల్ మోషన్ పోస్టర్ అంచనాలు పెంచేసింది.

స్కంద మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేయడంతో ఇప్పుడు రామ్ పోతినేని పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు. జులై 9న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ చేయనున్నారంట. జులై 12 నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారుచేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటి పార్ట్ లో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ లో కూడా నిధి అగర్వాల్ ని ఎంపిక చేసే ఛాన్స్ ఉందంట. ఇంకా రెండు రోజుల్లో ఈ సినిమా క్యాస్టింగ్ ఇంకా ఎవరెవరు ఉన్నారనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా రామ్ పోతినేని బోయపాటి సినిమా తర్వాత వెంటనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం విశేషం.

ఇక లైగర్ తో పూరి జగన్నాథ్ తన ఇమేజ్ ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడే వెతుక్కోవాలి అనే టార్గెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయడం విశేషం. మరి ఈ సినిమా పూరిని దారిలో పెడుతుందా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











