ఛార్మీ కోసం పూరీ త్యాగం.. ఎవరూ ఊహించని విధంగా!

Recommended Video

#iSmartShankar : Puri Jagannadh Sacrifies For Charmy Kaur || Ram Pothineni || Niddhi Agerwal

హిట్ కోసం ఒక్కటయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్. వీరిద్దిరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'ఇస్మార్ట్ శంకర్'. సరైన హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న ఈ ఇద్దరు ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఇందుకోసమే మాంచి మాస్ మసాలా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు.

‘ఇస్మార్ట్'కు భారీ రెస్పాన్స్

‘ఇస్మార్ట్'కు భారీ రెస్పాన్స్

‘ఇస్మార్ట్ శంకర్' నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్లు, వీడియో సాంగ్ ప్రోమోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇవి యూట్యూబ్‌లోకి వచ్చిన కొద్దిసేపట్లోనే ఊహించని స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ లుక్, తెలంగాణ స్టైల్ డైలాగ్స్, పూరీ టేకింగ్ సరికొత్తగా కనిపిస్తుండడంతో ఈ స్థాయి రెస్పాన్స్ వస్తోంది.

భారీగానే జరిగిన బిజినెస్

భారీగానే జరిగిన బిజినెస్

ఈ సినిమాకు సంబంధించి ఏది వదిలినా భారీ స్పందన వస్తుండడంతో బయ్యర్లు సినిమా హక్కుల కోసం ఎగబడ్డారు. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్' బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు జరిగిందట. అలాగే, థియేట్రికల్ రైట్స్‌తో కలుపుకుని ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ. 36.18 కోట్లు అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

వచ్చిన డబ్బులను ఛార్మీకి..

వచ్చిన డబ్బులను ఛార్మీకి..

ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఛార్మీకి ఇచ్చేశాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం గతంలో తన కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా' వల్ల ఛార్మీకి నష్టాలొచ్చాయి. ఆ నష్టాలను పూడ్చుకోడానికే పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

అన్నీ తానై వ్యవహరిస్తోంది

అన్నీ తానై వ్యవహరిస్తోంది

‘ఇస్మార్ట్ శంకర్'కు ఛార్మీ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న ఛార్మీ.. దీని కోసం ఎంతో కష్టపడింది. ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ వచ్చింది. అసలు ఈ సినిమాకు రామ్‌ను ఒప్పించింది కూడా ఛార్మీనేనన్న టాక్ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X