మహేష్ బాబుని కాదనుకున్న పూరి! విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నాడా?
ఇస్మార్ట్ శంకర్ విజయంతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లో నూతనోత్సాహం నెలకొంది. ఇన్నాళ్లు సరైన హిట్స్ లేక సతమతమైన ఆయన ఈ సినిమాతో మరోసారి ట్రాక్ ఎక్కినట్లే అని తెలుస్తోంది. అయితే మహేష్ బాబుకు పోకిరి, బిజినెస్ మాన్ లాంటి హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆయనతో మరో సినిమా చేయబోతున్నాడని అంతా భావించారు. జనగణమన పేరుతో ఈ సినిమా రానుందని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో తాను సినిమా చేసేదే లేదని ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు పూరి.
ఎప్పటికైనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' చేయాలని అనుకున్నానని, అది మహేష్‌తో చేయాలనుకునే మాట వాస్తవమే అని చెప్పిన పూరి.. ప్రస్తుతం తాను ఈ ప్రాజెక్టు లో హీరో విషయమై డిసీజన్ మార్చుకునట్లుగా అభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో 'జనగణమన' ప్రాజెక్టు లో మహేష్ కాకుండా ఇంకెవరు భాగం కాబోతున్నారనే ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు జనగణమన ప్రాజెక్టు లో విజయ్ దేవరకొండను స్థానం కల్పించనున్నాడట పూరి జగన్నాథ్. మహేష్ బాబు కోసం రాసిన ఆ కథ తోనే విజయ్‌ని సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట పూరి.

ఈ నేపథ్యంలో 'జనగణమన' కథను విజయ్‌కు త్వరలోనే వినిపించాలని పూరి సన్నాహాలు చేస్తున్నాడట. కాకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే డియర్ కామ్రేడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్.. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ తరుణంలో పూరి కథను విజయ్ ఓకే చేస్తాడా? ఒకవేళ చేస్తే డేట్స్ ఎప్పుడు ఇస్తాడు? అనేది చూడాలి మరి.


Click it and Unblock the Notifications











