పూరి కోరుకున్నాడు.. కానీ ఆ హాట్ బ్యూటీ కాదంది.. అందుకే చివరకు ఆమెతో!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి ట్రాక్ ఎక్కాడు. 'టెంపర్' సినిమా తర్వాత సరైన బ్రేక్ లేక కొట్టుమిట్టాడిన ఆయన చివరకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చాశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా రూపొందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

ముంబైలో షూటింగ్.. పూరి సినిమా అంటేనే
పూరి జగన్నాథ్ ప్రాజెక్టు అంటేనే అది ప్రత్యేకతల బుట్ట. షూటింగ్ మొదటి రోజు స్టార్ట్ చేసిన ఆయన జర్నీ చివరిదాకా అత్యంత వేగంతో ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇదే బాటలో తన తాజా సినిమా ఫైటర్‌ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పూరి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

ఓ రేంజ్ రొమాన్స్.. ఆ ఇద్దరూ!
పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రూపొందిస్తున్న ఈ ఫైటర్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరితో ఓ రేంజ్ రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేశారట పూరి. ఇటీవలే విడుదలైన షూటింగ్ పిక్స్ చూస్తే వాళ్ళ రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

పూరి ప్లాన్.. వర్కవుట్ చేద్దామనుకుంటే!
అయితే మొదట ఈ సినిమా కోసం బోల్డ్ బ్యూటీ దిశా పటానికి సంప్రదించారట పూరి జగన్నాథ్. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. హిందీలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దిశా పటాని క్రేజ్ క్యాచ్ చేయాలని ప్లాన్ చేశారట పూరి.

ఇద్దరూ అలా.. ఊహల్లో ప్రేక్షకులు
దీంతో అనన్యపాండేని సంప్రదించగా, ఆమె ఓకే చెప్పిందట. ఏదేమైనా ఇప్పటివరకు విడుదలైన పిక్స్ చూస్తుంటే మాత్రం విజయ్ దేవరకొండ- అనన్యపాండే జోడీ వెండితెరపై హంగామా చేయడం ఖాయం అని స్పష్టమవుతోంది. చూడముచ్చటగా ఈ జంట కనిపిస్తుండటం, పైగా పూరి టేకింగ్ కాబట్టి ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఉహించుకుంటున్నారు.
Recommended Video


శ్రీమతి లావణ్య సమర్పణలో..
ఇకపోతే ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్ దేవరకొండ. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











