»   »  స్టార్ హీరోలకు దూరం అవుతున్న పూరి జగన్నాథ్, కారణం అదేనా?

స్టార్ హీరోలకు దూరం అవుతున్న పూరి జగన్నాథ్, కారణం అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే పూరి జగన్నాథ్... ఈ మధ్య స్టార్లకు పూర్తిగా దూరం అయ్యారు. టెంపర్ తర్వాత పూరి ఏ స్టార్ హీరోతోనూ చేయలేదు. కొందరు స్టార్లతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసినా ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు.

టెంపర్ తర్వాత పూరి చేసిన సినిమాలేవీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజం చిత్రాలకు బాక్సాఫీసు వద్ద ఆశించిన వసూళ్లు సాధించలేదు. గత ఆరు నెలల కాలంలో పూరి ఎన్టీఆర్, బాలయ్య, వెంకటేష్ లాంటి స్టార్లను సంప్రదించి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే ఆ సినిమా లేవీ ఓకే కాలేదు.

Puri Jagannadh's career graph down

'రోగ్‌' పేరుతో మరో చంటిగాడిని తయారు చేస్తున్న పూరి... (ఫోటోస్)

ఇజం సినిమా హిట్టయితే పూరితో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు నందమూరి బ్రదర్స్. కానీ ఆ చిత్రం ప్లాప్ కావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. వెంకీతో సినిమా ఓకే అయినట్లే అయింది కానీ... బడ్జెట్, పూరి రెమ్యూనరేషన్ విషయంలో సెట్టవ్వక ముందుకు సాగడం లేదని టాక్.

ప్రస్తుతం పూరి కొత్త హీరోతో 'రోగ్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే తప్ప పూరి మళ్లీ ఫాంలోకి వచ్చే అవకాశం లేదు. పరిస్థితి ఇలానే సాగితే పూరి కెరీర్ డేంజర్లో పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

English summary
'Temper' was Puri Jagannadh's last commercial success. All the three films released after this Cop Drama were disasters. In the past six months, Puri has approached NTR, Venkatesh & Balakrishna but none of those projects materialized. Tarak shelved his project with Puri after 'ISM' flopped.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu