ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ.. విజయ్ దేవరకొండ వద్దకు.. సాహసం చేస్తున్నాడా.!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కూడా పూరీ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకోబోతున్నారని, ఈ సినిమా కోసం 'ఫైటర్' అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించారని ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

Puri Jagannadhs Fighter: Jr Ntr Rejected.. Vijay Deverakonda Accepted

ఈ సినిమా కథను పూరీ జగన్నాథ్ మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించాడట. అయితే, ఆ కథను తారక్ రిజక్ట్ చేశాడని అంటున్నారు. ఈ విషయాన్ని పూరీకే స్వయంగా వెల్లడించాడట. ఇప్పుడు ఇదే కథను విజయ్ దేవరకొండకు చెప్పగా, అతడికి బాగా నచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే, కొన్ని మార్పులు చేయాలని సూచించాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఈ స్క్రిప్టులో విజయ్ సూచించిన మార్పులతో పాటు అతడి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు మారుస్తున్నాడని అంటున్నారు. అందుకోసమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను జనవరిలో మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందులో శిక్షణ తీసుకోడానికి అతడు 'థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్‌లోనే నడుస్తుందట. అందుకే దీనికి 'ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X