పూరి జగన్నాథ్ భలే వర్కవుట్ చేశాడే.. అనుకున్నట్లుగానే!
కొన్నేళ్లపాటు సరైన హిట్స్ లేక సతమతమైన పూరి జగన్నాథ్ ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి లైమ్‌లైట్ లోకి వచ్చేశారు. అదే జోష్‌లో ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా రూపొందిస్తున్నారు. ఛార్మి, పూరిజగన్నాథ్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పూరి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలాగే సినిమాపై క్రేజ్‌ని పెంచడం కోసం వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ని రంగంలోకి దింపాలనుకుంటున్నారని వార్తలు విన్నాం. ఈ నేపథ్యంలో ఆయనతో డీల్ సెట్ చేసిన పూరి.. తొందర్లోనే మైక్ టైసన్‌ని సెట్స్ పైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మైక్ టైసన్ కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. పూరి తన ఫైటర్‌లో మైక్ టైసన్ చేత విలన్ క్యారెక్టర్ చేయించబోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వెండితెరపై మన విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ పోరాటాన్ని చూసేయొచ్చన్నమాట.
ఇక ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. సర్వ హంగులు జోడించి పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











