పైసా వసూల్‌కి పూరి స్కెచ్.. బాలకృష్ణతో పోలీస్ వేషం వేయించి! వెరీ ఇంట్రెస్టింగ్
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పూరి జగన్నాథ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఆ లోటు పూడ్చుకున్నాడు. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయి ఆడియన్స్ దిమాక్ ఖరాబ్ చేసేసింది. ఇక ఆ వెంటనే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని ప్రకటన చేశాడు పూరి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో బాలకృష్ణతో కలిసి 'పైసా వసూల్' చేసిన ఈ డాషింగ్ డైరెక్టర్.. మరోసారి అదే పనికి సిద్దమవుతున్నారట. అర్థంకాలేదా? అదేనండీ.. బాలకృష్ణ- పూరి జగన్నాథ్ కాంబోలో మరో సినిమా రానుందట. నిజానికి ఈ సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. . బాలకృష్ణ సినిమా అంటే ఆయన రేంజ్‌కి తగ్గ కథ రెడీ చేయాలని, అది సిద్దమయిన వెంటనే బాలయ్యబాబుకు వినిపిస్తానని గతంలో చెప్పిన పూరి ఆ పని చేశారనేది తాజా సమాచారం.

పూరి సిద్ధం చేసిన కథను బాలకృష్ణ వినేయడం .. ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూస్తే మరోసారి పూరి జగన్నాథ్ పైసా వసూల్‌కి స్కెచ్ వేశాడన్నట్టే కదా! అది కూడా బాలయ్యబాబుతో పోలీస్ వేషం వేయించి. వినడానికి ఆసక్తిగానే ఉన్నా ఆచరణలోకి వస్తుందో.. రాదో చూడాలి మరి.
ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. ఈ సినిమాలో యంగ్ లుక్‌లో ఆయన దర్శనమీయనుండటం ఆసక్తికర అంశం. ఇక ఇది పూర్తయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా మొదలు కానుంది. అది కూడా పూర్తయ్యాక బాలకృష్ణ- పూరి జగన్నాథ్ కాంబో సినిమా ప్రారంభం కానుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











