పూరి జగన్నాథ్ ఆలోచనలో పాన్ ఇండియా హీరో.. నిజమైతే అభిమానులకు పండగే

డైలాగ్స్ తో అలాగే మాస్ ఎలివేషన్ సీన్స్ తో వెండితెరపై చిటికెలో హీట్ తెప్పించగల దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ మాస్ దర్శకుడి ప్లాప్ సినిమాల్లో కూడా ఏదో ఒక పాయింట్ జనాలకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా హీరో స్టైల్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. డైలాగ్స్ తోనే అంచనాల డోస్ పెంచగల పూరి చాలా రోజుల తరువాత పరభాషా హీరో కోసం కథ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న పూరి ఆ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్ లో కరణ్ జోహార్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ కానుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే పూరి జగన్నాథ్ కన్నడ హీరో యష్ తో కూడా ఒక సినిమా చేయాలని బావిస్తున్నాడట.

Puri Jagannadh special focus in kannada star yash

ఇప్పటివరకు పూరి జగన్నాథ్ ఫైటర్ అనంతరం ఇంకా ఎవరితో వర్క్ చేయాలనే విషయంలో కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ KGF హీరో ఓకే అంటే వెంటనే ప్రాజెక్టును ఎనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

కెరీర్ మొదట్లో తమ్ముడు, ఇడియట్ సినిమాలను కన్నడలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన పూరి జగన్నాథ్ మళ్ళీ ఆ తరువాత 2017లో ద్విభాషా చిత్రంగా రోగ్ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఫైనల్ గా ఇప్పుడు యష్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్ అయితే వస్తోంది. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X