నెపోటిజమ్ ఎఫెక్ట్.. విజయ్ దేవరకొండ సినిమా కోసం పూరి జగన్నాథ్ మరో కొత్త ప్లాన్!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ నెక్స్ట్ విజయ దేవరకొండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్ సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. పూరి జగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండడంతో అంచనాలు అకాశాన్ని దాటాయి.
ముంబైలో షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. ఇక త్వరలోనే మళ్ళీ వర్క్ స్పీడ్ పెంచాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. హిందీలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని పూరి కరణ్ జోహార్ తో కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నెపోటిజమ్ కారణంగా కరణ్ పై విమర్శలు ఒక రేంజ్ లో వస్తున్నాయి.

కరణ్ జోహార్ భవిష్యత్తు సినిమాలపై తప్పకుండా ప్రభావం పడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆ ఎఫెక్ట్ తన సినిమాపై పడకుండా పూరి ఒక బాలీవుడ్ స్టార్ ని విజయ్ సినిమా కోసం గట్టిగా వాడనున్నాడట.
సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర చేయించి హిందీ ప్రమోషన్స్ బాధ్యత మొత్తం అతనిపైనే మోపాలని ఒక స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఛార్మి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











