పవన్ కల్యాణ్ కాదు.. మహేశ్ బాబు కాదు.. పూరీ జగన్నాథ్ తర్వాతి సినిమా ఆ స్టార్ హీరోతోనే.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్లను ప్రేక్షకులకు అందించాడు. హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడంలో తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన పూరీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత అతడు టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడట. ఇప్పుడు ఆ స్క్రిప్టు మీదే వర్క్ చేస్తున్నాడని సమాచారం. ఇంతకీ ఎవరా హీరో.?

Recommended Video

Puri Jagannath Upcoming Movie With That Star Hero
క్రేజీ హీరోతో మూవీ.. అన్నీ తానయ్యాడు

క్రేజీ హీరోతో మూవీ.. అన్నీ తానయ్యాడు

‘ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన ఉత్సాహంతో జోరు మీదున్నాడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఆయన ఓ సినిమా చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీని అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు. అలాగే, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి ‘ఫైటర్', ‘లైగర్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

పాన్ ఇండియా రేంజ్‌ అయిపోయింది

పాన్ ఇండియా రేంజ్‌ అయిపోయింది

ఇద్దరు స్టార్లు కలిసి చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే రూపొందించాలని అనుకున్నారు. అయితే, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ మూవీ స్క్రిప్ట్ చూసిన తర్వాత నిర్మాణ భాగస్వామిగా మారారు. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్.

పూరీ జగన్నాథ్ తర్వాతి సినిమాపై ప్రచారం

పూరీ జగన్నాథ్ తర్వాతి సినిమాపై ప్రచారం

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న పూరీ.. దీని తర్వాత ఏ హీరోతో కలుస్తాడన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా పూరీ.. పవన్‌కు ఓ కథ చెప్పాడని వార్తలు వచ్చాయి. అలాగే, మహేశ్ బాబుతోనూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన' చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

పూరీ తర్వాతి సినిమా ఆ స్టార్ హీరోతోనే.!

పూరీ తర్వాతి సినిమా ఆ స్టార్ హీరోతోనే.!

ఓ సినిమా పట్టాలపై ఉండగానే.. పూరీ జగన్నాథ్ మరో సినిమాకు కథను రెడీ చేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అది కూడా తనకు ఎంతగానో నచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ కోసమని ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావంతో ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న పూరీ.. బాలయ్య కోసం పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

 పైసా వసూల్‌ మర్చిపోయేలా చేస్తాడట

పైసా వసూల్‌ మర్చిపోయేలా చేస్తాడట

గతంలో బాలయ్య - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘పైసా వసూల్' అనే సినిమా వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో పూరీ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ల కాంబోలో రాబోయే సినిమాతో ‘పైసా వసూల్' ఫ్లాప్‌ను మర్చిపోయేలా చేయాలని డైనమిక్ డైరెక్టర్ భావిస్తున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X