Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
హాట్రిక్ పనిలో పడ్డ ప్రభాస్- పూరి జగన్నాథ్! వెరీ ఇంట్రెస్టింగ్.. ఇంతకీ నిజమేనా?
Recommended Video
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాట్రిక్ కోసం రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ సాధించిన పూరి ప్రభాస్‌తో సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ప్రభాస్ కోసం పూరి సిద్ధం చేసిన కథ ఏంటి? ఇద్దరూ కలిసి హాట్రిక్ సినిమాను ప్లాన్ చేశారా? అందులో నిజమెంత? ఆ వివరాలు చూస్తే..
సాహో తర్వాత ప్రభాస్.. పూరితో
ఇటీవలే భారీ సినిమా సాహోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత పుంజుకొని కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన ప్రభాస్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇక దీని తర్వాత ఆయన సినిమా తన డైరెక్షన్లోనే ఉండాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడట పూరి జగన్నాథ్.
ఇస్మార్ట్ జోష్‌లో పూరి.. రెడీ అంటున్నాడు
గత కొంతకాలంగా సక్సెస్ లేక సతమతమైన పూరి జగన్నాథ్ ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ హిట్ సాధించారు. ఇక ఈ జోష్ లోనే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కొత్త సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తదుపరి ప్రాజెక్టు ప్రభాస్ తో చేయాలని డిసైడ్ అయిన పూరి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారట.
మహేష్ కోసం అనుకున్న కథనే..
ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్టు 'జనగణమన' పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు పూరి. ఈ కథ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నప్పటికీ అది సెట్ కాలేదట. దీంతో అదే స్క్రిప్ట్‌తో ప్రభాస్‌ని లైన్ లోకి తీసుకొస్తున్నారట పూరి జగన్నాథ్. ఇప్పటికే ప్రభాస్‌కి కూడా ఈ కథ వినిపించినట్టుగా సమాచారం. దీనికి ప్రభాస్ కూడా సుముఖత వ్యక్తం చేశారని టాక్.
ఇదే జరిగితే హాట్రిక్..
ఒకవేళ ఇదే నిజమైతే పూరి జగన్నాథ్- ప్రభాస్ కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ ఇదే అవుతుంది. గతంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సంగతి తెలిసిందే. పైగా పూరి జగన్నాథ్ అంటే ప్రభాస్‌కి ఓ రేంజ్ అభిమానం కూడా. సో చూడాలి మరి 'జనగణమన' ప్రభాస్ హీరోగానే రూపొందనుందా? అనేది.