రిజెక్ట్ చేసిన స్టార్ హీరోల దిమ్మతిరిగేలా పూరి ప్లాన్.. బాలీవుడ్ బడా హీరోలతో..
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల వరకు వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతమైన పూరి ప్రస్తుతం బాక్సాఫీస్ హిట్స్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇక విజయ్ దేవరకొండతో సినిమా చేసిన తరువాత ఎక్కువగా ఈ సీనియర్ డైరెక్టర్ హిందీ హీరోలను టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ కరణ్ జోహార్ తోనే మరో రెండు పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నారట.

స్టార్ హీరోలందరితో..
పూరి జగన్నాథ్ దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేశాడు. నేటితరం కుర్ర హీరోలతో కూడా వర్క్ చేసిన పూరి జగన్నాథ్ ప్లాప్స్ ఎదురైన సమయంలో ఓ వర్గం స్టార్ హీరోలను కలవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఒకప్పుడు హిట్స్ ఇచ్చినప్పటికి ఆయనను కేర్ చేయకుండా తప్పుంచుకుని తిరిగిరానే టాక్ వచ్చింది.

మహేష్ బాబుతో..
ఆ మధ్య పూరి మహేష్ బాబుపై ఎవరు ఊహించని విధంగా ఒక కామెంట్ చేసిన విషయం తెలిసిందే. జనగణమన చేయాలని అనుకున్నప్పటికి ఫామ్ లో లేనందున మహేష్ చేయలేదని అనడం అప్పట్లో వైరల్ అయ్యింది. మహేష్ తో మరోసారి వర్క్ చేయలేనని కూడా పూరి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. అదే తరహాలో మరికొంత మంది హీరోలు కూడా పూరితో వర్క్ చేయకుండా దూరం పెట్టారట.

వారి నోళ్లు మూయించేలా..
అయితే తనను దూరం పెట్టినవారికి దిమ్మ తిరిగేలా పూరి జగన్నాథ్ మరో పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ బాలీవుడ్ హీరోలతో బిగ్ బడ్జెట్ లో డిఫరెంట్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించబోతున్నాడట. పూరి పనైపోయిందన్న వారి నోళ్లు మూయించేలా.. ఎవరు ఊహించని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ లో ఇద్దరు హీరోలతో కథా చర్చలు జరిపినట్లు సమాచారం.
Recommended Video

బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్..
విజయ్ దేవరకొండతో ప్రస్తుతం ఒక సినిమాను చేస్తున్న పూరి జగన్నాథ్ ఆ సినిమా అనంతరం మరో ఫ్యాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం రెండు బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాల కోసం కరణ్ జోహార్ తో మరోసారి చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం కథలు సిద్ధం చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











