ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. బాలయ్యతో పూరి జగన్నాథ్!
పూరీ జగన్నాద్ గురించి ఆయన టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు హీరోలకు ఉన్న ఇమేజ్‌ను పూర్తిగా పక్కనబెట్టేసి.. తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించేలా చేస్తాడు. అందుకే పూరి హీరోలంతా మాస్ హీరోలు అయ్యారు. అందరికీ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మొదటి సినిమా బద్రి నుంచి మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ వరకూ ప్రతీ సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరు అందరికీ తెలిసిందే.
దర్శకుడిగా పూరీ జగన్నాద్‌కు ఇరవై యేళ్లు పూర్తయ్యాయి. బద్రి సినిమా విడదలై నిన్నటికి (ఏప్రిల్ 20) ఇరవై యేళ్లు నిండాయి. ఈ సందర్భంగా పూరికి విషెస్ వెల్లువెత్తాయి. మరో ఇరవై యేళ్లు ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించాలని అంతా కోరుకున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాద్ తదుపరి ప్రాజెక్ట్ గురించి రూమర్స్ మొదలయ్యాయి. పూరి జగన్నాద్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

పూరి తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ ప్యాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అది కూడా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో. ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే కొంత బాగాన్ని షూట్ చేశారు. అయితే తాజాగా పూరి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. పైసా వసూల్ లాంటి హిట్ చిత్రాన్ని బాలకృష్ణకు ఇచ్చిన పూరీ.. మరో విజయాన్ని అందించేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాబోతోందని టాక్. ఫైటర్ చిత్రం పూర్తయ్యాక బాలయ్యతో పూరీ ఓ సినిమాను చేసేందుకు సిద్దమవుతున్నాడట.


Click it and Unblock the Notifications











