ఓటీటీలోకి పూరీ జగన్నాథ్ సినిమా: భారీ ఆఫర్ రావడంతో ఒప్పుకోక తప్పలేదు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. ఈ సినిమాతో నిర్మాతగానూ భారీ లాభాలను అందుకున్నాడు పూరీ. దీని తర్వాత తన కుమారుడు ఆకాశ్ పూరీతో 'రొమాంటిక్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. దీనిని పూరీ శిష్యుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది.

కొద్ది రోజుల క్రితం 'రొమాంటిక్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో ఆకాశ్.. హీరోయిన్ కేతిక శర్మ కౌగిలించుకుని ఉన్నారు. అయితే, హీరోయిన్ ఒంటిపై దుస్తులు లేకపోవడమే అసలు సమస్య. దీంతో ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాతో పాటు చాలా మంది సామాన్యులు కూడా విమర్శల వర్షం కురిపించారు. అప్పట్లో ఈ పోస్టర్ వైరల్ అయింది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'రొమాంటిక్'ను విడుదల చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ముందుకొచ్చిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Puri Jagannadh’s Romantic will Release in ZEE5

బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో దీన్ని ఓటీటీలో విడుదల చేయడానికి పూరీ జగన్నాథ్ అండ్ కో సిద్ధమైందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, పూరీ ఆకాశ్ హీరోగా ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. అవేమీ హిట్ అవలేదు. దీంతో 'రొమాంటిక్' విషయంలో పూరీ జగన్నాథ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా తెరకెక్కించే సమయంలో దగ్గరుండి పర్యవేక్షించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X