విజయ్ సాక్షిగా.. ఛార్మీ కోసం పూరీ ఇలాంటి పని చేశాడా.. బయటికొచ్చిన షాకింగ్ న్యూస్.!

'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ - 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఓకే అవ్వడం వెనుక జరిగిన పరిణామాలకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Recommended Video

Vijay Devarakonda & Puri Jagannadh Join Hands For A Project || Filmibeat Telugu
సొంత బ్యానర్‌పైనే

సొంత బ్యానర్‌పైనే

విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది.

కథపై నమ్మకమా? సెంటిమెంటా?

కథపై నమ్మకమా? సెంటిమెంటా?

ఈ సినిమాను సొంత బ్యానర్‌పై చేయాలనుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. కొందరు పూరీకి తన కథపై ఉన్న నమ్మకం వల్లే అని అంటుండగా, మరికొందరు మాత్రం గత చిత్రం హిట్ అవడంతో సెంటిమెంట్‌గా భావిస్తున్నాడని చెబుతున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.

పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మైత్రీని వదులుకున్న విజయ్

మైత్రీని వదులుకున్న విజయ్

‘డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే, అది అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. కానీ, పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ బడా సంస్థను వదులుకున్నాడని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఛార్మీ కోసం పూరీ

ఛార్మీ కోసం పూరీ

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉన్నా.. పూరీ తన భాగస్వామ్యం కూడా ఉండాలన్న కండీషన్ పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే సదరు సంస్థ ఒప్పుకోకపోవడంతో పూరీనే స్వయంగా నిర్మించడానికి సిద్ధం అయ్యాడని టాక్. ఆయన ఈ స్టెప్ తీసుకోవడం వెనుక ఛార్మీ ఉందని తెలుస్తోంది. ఆమె గత చిత్రాన్ని బాగా డీల్ చేసింది. అందుకే ఈ సినిమాలోనూ ప్రొడక్షన్ ఛార్మీనే చూసుకుంటుందని పూరీ చెప్పినా.. మైత్రీ వాళ్లు ఒప్పుకోలేదట. అందుకే పూరీ డేరింగ్ స్టెప్ వేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X