మరో పాన్ ఇండియా హీరోను పట్టేసిన పూరి జగన్నాథ్.. విజయ్ తరువాత అతనితోనే..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అనంతరం తన స్టైల్ ని పూర్తిగా మార్చేశాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు తీసే పూరి ఈ మధ్య కాలంలో మాత్రం ఏడాదికి ఒక్కటే అంటున్నాడు. గతంలో ఇంటర్వ్యూలలో స్లోగా సినిమాలు తీయడం నాకు నచ్చదని చెప్పన పూరి ఇప్పుడు మాత్రం చాలా టైమ్ తీసుకుంటున్నాడు.

Recommended Video

Mahesh Babu Comments On Movie With Puri Jagannath
ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు..

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు..

2019 జూలైలో ఇస్మార్ట్ శంకర్ సినిమాను విడుదల చేసిన పూరి జగన్నాథ్ ఆ తరువాత ఇయర్ ఎండింగ్ లో విజయ్ దేవరకొండ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అనంతరం కోవిడ్ కారణంగా బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పటికి కూడా ఇంకా సరైన ట్రాక్ లో షూటింగ్ స్టార్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇక ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

మరో పాన్ ఇండియా మూవీ

మరో పాన్ ఇండియా మూవీ

ఆ విషయం పక్కన పెడితే.. పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్లాన్ కూడా ఇప్పుడే రెడీ చేసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫైటర్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఆ తరువాత సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నాడు. అందుకోసం మరో పాన్ ఇండియా హీరోనే టార్గెట్ చేసినట్లు టాక్.

KGF హీరోకు కథ చెప్పిన పూరి

KGF హీరోకు కథ చెప్పిన పూరి

పూరి జగన్నాథ్ త్వరలో KGF హీరో యష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు అటు కన్నడ ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ వినిపించిన పూరి హీరో నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నట్లు సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఆ సినిముఖ్ఆ తెరకెక్కుతుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్ అయితే వస్తోంది.

ఆ దర్శకులు కూడా యష్ పైనే ఫోకస్

ఆ దర్శకులు కూడా యష్ పైనే ఫోకస్

ఇక నెక్స్ట్ యష్ KGF 2తో మరో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు భారీ స్థాయిలో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా విడుదల తరువాత యష్ ఒక కోలీవుడ్ దర్శకుడితో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు మరొక రూమర్ వైరల్ అవుతోంది. తమిళ స్టార్ దర్శకులు యష్ తో పాన్ ఇండియా ప్రాజెక్టునే ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X