కొడుకు సినిమాపై మరోసారి ఫోకస్ పెట్టిన పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్.. ఈ స్టార్ దర్శకుడు కెరీర్ లో దాదాపు తెలుగులో అందరి హీరోలతో వర్క్ చేశాడు. ఇక ప్రతి ఒక్క హీరో కూడా పూరి జగన్నాథ్ తో మినిమామ్ సక్సెస్ అందుకున్నవారే. అదే తరహాలో సొంత కొడుకు కూడా విజయాన్ని ఇవ్వాలని ప్లాన్ వేశారు. మొదట ఆకాష్ పూరిని మెహబూబా సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.
మొత్తానికి పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చేశారు. ఇక విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బిజీగా ఉండడం వలన ఈ సారి కొడుకు సినిమాను తను డైరెక్ట్ చేయకుండా శిష్యుడు అనిల్ కు ఇచ్చాడు. రొమాంటిక్ సినిమాను సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యింది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబైలో లైగర్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ రొమాంటిక్ సినిమా ఎడిటింగ్ పై ఎప్పటికప్పుడు ఒక లుక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా కొడుకు సినిమాపై చాలా కేరింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. గత ఏడాది దాదాపు షూటింగ్ ఎండింగ్ లో ఉండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. మళ్ళీ పట్టాలెక్కింది అయితే సినిమా అవుట్ పుట్ పై సంతృప్తిగానే ఉన్న పూరి జగన్నాథ్ కొన్ని సీన్స్ పై మాత్రం అనుమానాలు వ్యక్తం చేశాడట. అందుకే రీ షూట్ ప్లాన్ చేసినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











