150 కోట్లతో పుష్ప విలన్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్.. దర్శకుడు ఎవరో తెలుసా

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2: ది రూల్ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా బాక్స్ ఆఫీస్ వద్ద 1870 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది. దీనికంటే ముందు పుష్ప చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు పుష్ప రాజ్ క్యారెక్టర్ తో పాటు మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన షికావత్ బన్వర్ సింగ్ పాత్ర కూడా ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోయింది.

మలయాళం లో టాప్ హీరోగా ఫహద్ ఫాజిల్ కెరియర్ను లీడ్ చేస్తున్నారు. ఆయన తెలుగులో అల్లు అర్జున్ కు పుష్ప చిత్రం ద్వారా నెగటివ్ రోల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యారు. ఆయన నటనకు అభిమానులే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఫిదా అయ్యారు. పుష్ప కంటే ముందు విక్రమ్ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ పాత్రలో నటించే ఆకట్టుకున్నారు. కమలహాసన్ ఫహద్ ఫాజిల్ వెంటాడే సీన్లు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నిలిచాయి. చివరిగా పుష్ప 2 తో ప్రేక్షకులను అలరించారు.

Pushpa 2 Fahadh Faasil Tollywood Debut film with this director

అయితే ఈ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. త్వరలోనే ఫహద్ ఫాజిల్ తెలుగులో సినిమా చేయబోతున్నారని, అది కూడా హీరోగా డైరెక్ట్ తెలుగు ఫిలిం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ మరెవరో కాదు టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ ను వెచ్చించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ వరుసగా పరాజయాలను చవిచూస్తూ సతమతమవుతున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి చిత్రాలు పూరి జగన్నాథ్ కు దగ్గర దగ్గర 150 కోట్ల వరకు నష్టాన్ని చేకూర్చాయని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. అయితే హిట్ ఫ్లాఫ్ లను పెద్దగా లెక్క చేయని పూరి జగన్నాథ్ తన రాబోయే చిత్రాలకు మరింత పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హ్యూజ్ లైనప్ తో అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

కాగా పూరి జగన్నాథ్ ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో ఒక సినిమాను కన్ఫామ్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు కూడా పూరి జగన్నాథ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా. ఈ క్రమంలోనే ఫహద్ ఫాజిల్ తో సినిమాను కూడా పూరి జగన్నాథ్ ఓకే చేయించారని సమాచారం అందుతుండడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X