Varanasi: వారణాసిలో రాముడుగా మహేశ్‌బాబు.. మరి హనుమంతుడు ఎవరు?

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ "వారణాసి". ఈ భారీ బడ్జెట్ మూవీపై రోజుకో కొత్త హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా ప్రకటన నుంచి టైటిల్ అనౌన్స్ వరకు ఓ చర్చ అయితే.. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి మరో చర్చ.. సినిమాలో ఏఏ పాత్రలు కనిపించబోతున్నాయి? ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అనే వార్తలు మొదలయ్యాయి. ఇలా సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా హాట్ టాపిక్ గా మారిపోతుంది. తాజాగా మహేశ్ బాబు రాముడి పాత్రలో నటిస్తే.. మరి హనుమంతుడి పాత్రలో ఎవరు? నటించబోతున్నారు? అనే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ హనుమంతుడు ఎవరంటే?

మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై అంచనాలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు మహేష్ గెట్‌అప్‌ను విడుదల చేసారు.పైగా మహేశ్ బాబు నంది పై త్రిశూలం పట్టుకుని ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించింది. ఇక టైటిల్, టీజర్ విడుదలతో గ్లోబల్ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. అందులో ముఖ్యంగా రామాయణం ఆధారిత విజువల్స్, హనుమాన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాముడి పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నారని రాజమౌళి స్వయంగా చెప్పడంతో రాముడి లుక్ గురించి క్లారిటీ వచ్చేసింది. కానీ, హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారు? అన్న ప్రశ్న మాత్రం సినీ అభిమానుల్లో ఉత్కంఠకు గురి చేస్తోంది.

R Madhavan to Play Hanuman in Mahesh Babu-Rajamouli Pan-World Film Varanasi Buzz Peaks

హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే అంశం మొదటి నుంచే ఉత్కంఠగా మారింది. మొదట కన్నడ స్టార్ హీరో సుదీప్ హనుమంతుడిగా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో 'ఈగ'లో, 'బాహుబలి'లో రాజమౌళితో పనిచేసిన అనుభవం హీరో సుదీప్ కు ఉండటంతో ఆ రూమర్ కాస్త బలం చేసుకుంది. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బజ్ ప్రకారం హనుమంతుడి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ నటించనున్నట్టు సమాచారం. ఇది వినగానే సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది.

రాజమౌళి అలిగారు.. అవమానించలేదు.. తెలుగు హీరోల ట్రోల్స్‌పై హైపర్ ఆది ఫైర్..
మహేశ్ బాబు- రాజమౌళి కాంబో మూవీ వారణాసి లో తమిళ హీరో మాధవన్ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయన హనుమాన్ పాత్ర కోసం ఎంపిక అయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. హనుమాన్ పాత్రకు మాధవన్ సరిపోతారా? ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ జరుగుతోందా? రాజమౌళి విజన్‌లో హనుమాన్ ఎలా కనిపిస్తాడు? అనే ప్రశ్నలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

అయితే.. వారణాసి మూవీలో మాధవన్ కనిపించబోతున్నరనే టాక్ రావడానికి మరో కారణం కూడా ఉంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మొదట రిలీజ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లుక్ పోస్టర్లపై మాధవన్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.దాంతో అభిమానులు అంతా "మాధవన్ కూడా సినిమాలో ఉన్నాడని అందుకే ఇంత యాక్టివ్‌గా రియాక్ట్ చేస్తున్నారా?" అని అనుమానాలు వ్యక్తమతున్నాయి. సోషల్ మీడియా, ఇండస్ట్రీ ఇన్ పుట్స్ ప్రకారం.. మాధవన్ పై ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారంట. త్వరలోనే ఆయన పాత్రను సినిమా టీమ్ అధికారిక అనౌన్స్‌మెంట్ చేయబోతుందని టాక్.

ఇదిలా ఉంటే.. వారణాసి టైటిల్ ఇప్పటికే వివాదాలకు దారితీసింది. మరో నిర్మాణ సంస్థ కూడా ఇదే టైటిల్ ప్రకటించడంతో విషయం ఫిల్మ్‌చాంబర్‌కి వెళ్లింది. అదే సమయంలో రాజమౌళి ఈవెంట్‌లో దేవుళ్లపై నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలు వివాదస్పాదంగా మారాయి. ఈ వివాదాలు సినిమా చుట్టూ మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఏదిఏమైనా వారణాసి సినిమాపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. హాలీవుడ్ దృష్టి పడింది. ఆ హైప్ చూస్తుంటే.. పాన్ వరల్డ్ లెవెల్‌లో హిస్టారికల్‌ మూవీగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X