భారీగా పెరిగిన శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయం.. ఒక్క నెలకి సంపాదన ఎంతంటే?

ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మంచి ఆదాయ వనరుగా మారింది. అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారి బాగా సంపాదించుకుంటున్నారు. బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మంచి రాబడి వస్తోంది. ఇక క్రియేటర్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫాం ఊహించిన ఆదాయాన్ని తీసుకొస్తోంది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలనే వారికి నిర్ణీత మొత్తం ఫీజుగా పెట్టి సబ్‌స్క్రైబ్ కావాల్సి ఉంటుంది.

Also Read
Dhamaal 4 Day 1 Collections: ధమాల్ 4 తొలిరోజు కలెక్షన్స్.. అజయ్ దేవగణ్ మూవీకి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?
Dhamaal 4 Day 1 Collections: ధమాల్ 4 తొలిరోజు కలెక్షన్స్.. అజయ్ దేవగణ్ మూవీకి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?

అలా ఎంతమంది సబ్‌స్క్రైబర్లు పెరిగితే అంత ఆదాయం వస్తుంది. సామాన్యుల సంగతే ఇలా ఉంటే మరి సెలబ్రిటీలు, హీరోయిన్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న పోస్ట్‌తో వందల కోట్లు సంపాదించే సెలబ్రిటీలు ఎందరో. ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాగానే సంపాదిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

How Much Is Sreeleela Earning From Instagram Buzz Around Her Massive Social Media Income Goes Viral

బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన శ్రీలీల.. తొలుత కన్నడంలో నటించింది. అనంతరం రోషన్ మేకా హీరోగా వచ్చిన పెళ్లి సందD అనే మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు శ్రీలీల. తన క్యూట్ లుక్స్, అందం, డ్యాన్స్‌తో చిన్న వయసులోనే స్టార్‌ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు శ్రీలీల. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్రనటులతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎదురుచూసే కలల ప్రాజెక్ట్స్‌ను చాలా త్వరగా చేజిక్కించుకున్నారు శ్రీలీల. ప్రస్తుతం ధనుష్ సరసన హీరోయిన్‌గా తమిళంలో మరో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల.

Recommended For You
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?

చేసిన సినిమాలలో ఎక్కువగా ఫ్లాపులు ఉన్నప్పటికీ శ్రీలీలకు మాత్రం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఆమె అదృష్టం అని చెప్పడంతో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. హిట్లు- ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు గ్లామర్ షో, డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ తనలోని నటనను చూపించే పాత్ర పడాలని కోరుకుంటోంది. పాన్ ఇండియా స్టార్‌గా ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తోన్న శ్రీలీల.. తెలుగులో ఇప్పటికే సత్తా చాటగా, తమిళంలో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీతో బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది.

You May Also Like
Samantha: అఖిల్ అక్కినేనికి సమంత రిటర్న్ గిఫ్ట్... బంగారం పోస్ట్ వైరల్
Samantha: అఖిల్ అక్కినేనికి సమంత రిటర్న్ గిఫ్ట్... బంగారం పోస్ట్ వైరల్

ఇదిలాఉండగా.. సినిమాల రెమ్యునరేషన్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా శ్రీలీల భారీగానే సంపాదిస్తోంది. సినిమాకు 2 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం అందుకుంటోందని ఫిలింనగర్ టాక్. ఇక దేశంలోని పలు టాప్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్టార్లు ఆదాయాన్ని అందుకుంటున్నారు. శ్రీలీల కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు.

'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీలీల తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీలకు 16.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషనల్ పోస్ట్స్ ద్వారా బాగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒక్క ప్రోమోషనల్ పోస్ట్ పెడితే 5 నుంచి 10 లక్షల రూపాయలను ఫీజుగా అందుకుంటోందట. అలా మొత్తంగా ఒక్క ఇన్‌స్టాగ్రామ్ నుంచే నెలకు 30 నుంచి 50 లక్షల రూపాయలను శ్రీలీల ఆర్జిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీలీల క్రేజ్, మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X